మూగజీవాలు ఏ రూపంలో హింసకు గురైనా రష్మీ(Rashmi Gautam) సహించరు. యానిమల్ లవర్ గా ఆమె దీనిపై చాలా కాలంగా పోరాడుతున్నారు. కుక్కలతో పాటు ఇతర జంతువులను ఎవరైనా హింసించినట్లు తెలిస్తే ఆమె సహించరు. నేరస్థులపై సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేస్తారు.
27
jabardasth rashmi latest photos
ఇక బుల్లితెరపై హాట్ హాట్ గా కనిపించే రష్మీ హృదయం మాత్రం చాలా సున్నితం. సమయం దొరికినప్పుడల్లా ఆమె వీధి కుక్కలకు ఆహారం పెడతారు. అలాగే జంతువులపై ప్రేమ కలిగి ఉండాలని సాధారణ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉంటారు.
37
Rashmi Gautam
తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో కొన్ని కామెంట్స్ పోస్ట్స్ చేశారు. కొందరు యజమానులు తమ పెట్ డాగ్స్ ని నిరాదరణకు గురిచేయడంతో ఆమె మండిపడ్డారు. గత 24 గంటల్లో వివిధ జాతులకు చెందిన నాలుగు పెట్ డాగ్స్ నిరాదరణకు గురయ్యాయని ఆమె అంటున్నారు.
47
ఒక డాగ్ ని అడాప్ట్ చేసుకోవడం అంటే ఆర్థికంగా, మానసికంగా అత్యంత బాధ్యత కలిగిన విషయం. ఏళ్ల పాటు సాగే ఎమోషనల్ బాండింగ్. అలాంటిది మీకు కొంచెం కూడా శ్రద్ధ లేదా అని ప్రశ్నించారు. ఇక ఎవరైతే తమ పెట్ డాగ్స్ ని వదిలేశారో వాళ్ళను కర్మ వెంటాడుతుందని హెచ్చరించారు.
57
ఈ రోజు మీరు మీ డాగ్స్ ని వదిలేస్తే ఖచ్చితంగా మీ పిల్లలు రేపు మిమ్మల్ని నిరాదరణకు గురి చేస్తారు. ఎందుకంటే జాలి, దయ అనే పాఠాలు వాళ్లకు మీరు నేర్పలేదు కాబట్టి, అని రష్మీ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో కోట్ చేశారు. అంతే కాకుండా క్షమించాలి ఫ్రస్ట్రేషన్ లో చేస్తున్న పోస్ట్స్ ఇవి. ఇక ఉడతా భక్తిగా త్వరలో హైదరాబాద్, వైజాగ్ లో ఫ్రీ పెట్ డాగ్ రెస్క్యూ వ్యాన్స్ ప్రారంభించనున్నట్లు రష్మీ తెలిపారు.
67
ఈ సందర్భంగా గంగానది వరదల్లో మూడు కిలోమీటర్లు ఈది మావటి ప్రాణం కాపాడిన సంఘటన కూడా రష్మీ ఉదహరించడం జరిగింది. తన ప్రాణాలు కాపాడే ఆ ఏనుగును ఆ సమయంలో కూడా ముల్లు కర్రతో అతడు బాధకు గురి చేస్తున్నాడని రష్మీ వాపోయారు. ఆమె ఇంస్టాగ్రామ్ లో వరుస పోస్ట్స్ చేయడం జరిగింది. తాజా పోస్ట్స్ రష్మీకి మూగజీవాలపై ఉన్న అపరిమిత ప్రేమను నిరూపించాయి.
77
ఇలా ఒక ప్రక్క సోషల్ మీడియా ద్వారా యానిమల్ ప్రొటెక్షన్ పై పోరాడుతున్న రష్మీ యాంకర్ గా బుల్లితెరపై దూసుకుపోతుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ప్రత్యేక బుల్లితెర ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు. హీరోయిన్ గా మాత్రం రష్మీ జోరు తగ్గింది. ఆమెకు ఆ దిశగా అవకాశాలు రావడం లేదు.