నిర్మాతలకు షాక్ ఇస్తున్న ‘కేజీఎఫ్’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. రెమ్యూనరేషన్ డబుల్ చేసిన కన్నడ బ్యూటీ..

Published : Jul 15, 2022, 05:41 PM IST

సౌత్ ఇండస్ట్రీలో ‘కేజీఎఫ్’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) క్రేజ్ మామూలుగా లేదు. రెండో సినిమాకే రెమ్యూనరేషన్ ను డబుల్ చేసి నిర్మాతలకు షాకిస్తోంది. తాజాగా తను నటిస్తున్న ‘కోబ్రా’ మూవీకి ఎంత తీసుకుంటోందంటే..?  

PREV
16
నిర్మాతలకు షాక్ ఇస్తున్న ‘కేజీఎఫ్’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. రెమ్యూనరేషన్ డబుల్ చేసిన కన్నడ బ్యూటీ..

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ  ఎంతటి  సెన్సేషన్ ను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం.. సినీ మేకింగ్ లోనూ నయా ట్రెండ్ ను తీసుకొచ్చింది. యాక్షన్ ఫిల్మ్ ను సరికొత్త తీయొచ్చని చూపింది. ఈ మూవీలో యష్ హీరోగా నటించగా.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.

26

కేజీఎఫ్ ఛాప్టర్ 1 మరియు కేజీఎఫ్ ఛాప్టర్ 2లోనూ శ్రీనిధి శెట్టినే హీరోయిన్ గా నటించింది. గతంలో మోడలింగ్ చేసే శ్రీనిధికి ‘కేజీఎఫ్’ చిత్రమే మొదటిది. ఈ మూవీతోనే ఇటు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తొలిసినిమాతోనే యాంగ్రీ గర్ల్ గాను గుర్తింపు పొందింది. గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

36

ఛాప్టర్ 1 క్రియేట్ చేసిన హైప్ కి.. కేజీఎఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ తర్వాత వచ్చిన బ్లాక్ బాస్టర్ రెస్సాన్స్ తో  శ్రీనిధి శెట్టి కేరీర్ కూడా దారిలో పడింది. తొలిసినిమానే ఇండియన్ సినీ హిస్టరీలో నిలిచిపోయేలా చిత్రంలో నటించడం విశేషం. ఈ సినిమా తర్వాత అన్ని ఇండస్ట్రీల నుంచి శ్రీనిధి శెట్టికి ఆఫర్లు వస్తున్నాయి.

46

అయితే కేజీఎఫ్ విజయవంతం అవడంతో శ్రీనిధి కూడా రెమ్యూనరేషన్ ను డబుల్ చేసినట్టు తెలుస్తోంది. ‘కేజీఎఫ్’ ఛాప్టర్ 1 మరియు 2కు  రూ.3 కోట్ల వరకు తీసుకున్న కన్నడ బ్యూటీ తన తదుపరి చిత్రాల్లో నటించాలంటే మాత్రం భారీగానే డిమాండ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. రెండింతల రెమ్యూనరేషన్ అడుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
 

56

తన రెండో చిత్రం తమిళంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘కోబ్రా’ (Cobra)లో నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో నటించేందుకు శ్రీనిధి ఏకంగా రూ.7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తోంది. ఒక స్టార్ హీరోయిన్ కు ఇచ్చేంత రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి రావడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు. 
 

66

శ్రీనిధి శెట్టికి ప్రస్తుతం పాన్ -ఇండియన్ లెవల్లో క్రేజ్ దక్కడంతో దర్శక నిర్మాతలు కూడా ఒకే చెప్పారంట. ఇక ‘కోబ్రా’తో  తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాకు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా నటిస్తున్నారు. రూ.90 కోట్లతో సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పై నిర్మాత ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

click me!

Recommended Stories