స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మలయాళ రాపర్ వేదన్ తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఇది 'DC' సినిమా కోసమేనని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. కానీ, వేదన్ ఫొటో షేర్ చేశాడు తప్ప, వేరే ఏ సమాచారం ఇవ్వలేదు. అయినా, ఇది ఒక అద్భుతమైన కొలాబరేషన్ అవుతుందని అభిమానులు నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.
'రాకీ', 'కెప్టెన్ మిల్లర్' లాంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన అరుణ్ మాథేశ్వరన్ తర్వాతి చిత్రమే 'DC'. ఈ సినిమాలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరో. వమికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. లోకేష్ దేవదాస్ క్యారెక్టర్‌ను, వమికా చంద్ర క్యారెక్టర్‌ను కలిపి సినిమాకు 'DC' అని టైటిల్ పెట్టారు.