సమంత కామెంట్లపై రణ్‌ వీర్‌ సింగ్ అదిరిపోయే రియాక్షన్.. వీళ్ల రచ్చ మామూలుగా లేదుగా!

Published : Aug 02, 2022, 07:18 AM IST

రణ్‌వీర్‌ సింగ్‌పై సమంత తన ఇంట్రెస్ట్ ని తెలియజేసిన నేపథ్యంలో తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో స్పందించారు. ఆమె వ్యాఖ్యలపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు చేశారు. దీనికి సామ్‌ ఇచ్చిన రీప్లై సైతం వైరల్‌ అవుతుంది.  

PREV
16
సమంత కామెంట్లపై రణ్‌ వీర్‌ సింగ్ అదిరిపోయే రియాక్షన్.. వీళ్ల రచ్చ మామూలుగా లేదుగా!

సమంత(Samantha) ఇటీవల `కాఫీ విత్‌ కరణ్‌`(Koffee with Karan)షోలో రణ్‌ వీర్‌ సింగ్‌తో కలిసి డాన్సు చేస్తా అని రెండు సార్లు ఆయన పేరునే చెప్పింది. ఆయనపై తన ఇంట్రెస్ట్ ని, ఇష్టాన్ని వెల్లడించింది. ఆయన నటనకు తాను అభిమానిని అనే విషయాన్ని తెలియజేసింది. దీంతో సమంత వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. కొన్ని రోజులు చర్చ నడిచాయి. 

26

ఎట్టకేలకు ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌ స్టార్‌ రణ్ వీర్‌ సింగ్(RanVeer Singh) ని చేరాయి. దీంతో ఆయన సమంత కామెంట్లపై స్పందించారు. ఆమెతో కలిసి సినిమాలు చేయాలని ఉందని తెలిపారు. సమంత అద్భుతమైన మనిషి. నటిగా తనకు చాలా ఇష్టమని, వ్యక్తిగా ఆ ఇష్టం మరింత పెరుగుతుందని తెలిపారు. అంతేకాదు ఆమెపై ప్రశంసలు కురిపించారు. సమంత సహృదయం కలిగిన మనిషి అని, జోకులు వేస్తూ పక్కన ఉన్న వారిని నవ్విస్తుంటుందన్నారు. 

36

సమంతకి చాలా టాలెంట్ ఉందని, తామిద్దరం కలిసి ఓ యాడ్‌ షూట్‌ చేసినట్టు చెప్పారు రణ్‌ వీర్‌. ఆ సమయంలోనే తామిద్దరం మొదటిసారి కలుసుకున్నామని, అప్పుడే మా మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని చెప్పారు రణ్‌ వీర్‌ సింగ్‌. దీంతో రణ్‌ వీర్‌ సింగ్‌ కామెంట్లు సైతం వైరల్‌ అవుతున్నాయి. దీనికి సమంత మరోసారి రియాక్ట్ అయ్యింది. `రణ్‌వీరీఫైడ్‌` అని చెప్పింది. దీంతో సమంత, రణ్‌వీర్‌ల రచ్చ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.
 

46

హిందీలో కరణ్‌ జోహార్‌ నిర్వహించే `కాఫీ విత్‌ కరణ్‌` టాక్‌ షో ఇండియా వైడ్‌గా పాపులర్‌. సెలబ్రిటీలకు సంబంధించిన కెరీర్‌తోపాటు పర్సనల్‌ విషయాలను కూడా బోల్డ్ గా అడుగుతుంటారు. అంతే బోల్డ్ గా సమాధానాలను రాబడుతుంటారు. అందుకే దీనికి యమ క్రేజ్‌. అయితే ఈ సారి సౌత్‌ యాక్టర్స్ సమంత, విజయ్‌ దేవరకొండ ఇందులో పాల్గొన్నారు. 
 

56

సమంత అక్షయ్‌ కుమార్‌తో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా `నువ్వు బ్యాచిలరేట్ పార్టీని హోస్ట్ చేస్తే అక్కడ డ్యాన్స్ చేయడానికీ ఏ ఇద్దరు బాలీవుడ్ హీరోలను తీసుకుంటావు`అని కరణ్‌ ప్రశ్నించగా, రణ్‌ వీర్‌ సింగ్‌ అండ్‌ రణ్‌వీర్‌ సింగ్‌ అని చెప్పింది సమంత. రణ్‌వీర్‌తో ఓ యాడ్‌ను షూట్ చేశానని అప్పుడే ఆయనకు ఫ్యాన్‌ గా మారిపోయానని సామ్ చెప్పిన విషయం తెలిసిందే. 

66

మరోవైపు సమంత ఇప్పటికే రెండు బాలీవుడ్‌ ప్రాజెక్ట్ లు కన్ఫమ్‌ చేసుకుంది. ఆయుష్మాన్‌ ఖురానాతో ఓ సినిమా చేస్తుంది. అలాగే అక్షయ్‌ కుమార్‌ కూడా సమంతతో సినిమాచేసేందుకు ఆసక్తిని చూపించారు. అలాగే ఆఫర్‌ కూడాచేసినట్టు సమాచారం. దీంతోపాటు ఇంకో బాలీవుడ్‌ ఆఫర్‌ ఆమె చేతిలో ఉందని తెలుస్తుంది. ఇప్పుడు రణ్‌ వీర్‌ సింగ్‌ సైతం తన ఇంట్రెస్ట్ ని చూపించడంతో బాలీవుడ్‌లో సమంత గట్టిగానే పాగా వేయబోతుందని తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories