100 కోట్లతో కొత్త ఇల్లు కొన్న రణ్‌వీర్ - దీపికా!

First Published | Aug 30, 2024, 3:45 PM IST

నటి దీపికా పదుకొణే - రణ్‌వీర్ సింగ్ జంట త్వరలో తమ మొదటి బిడ్డను స్వాగతించనున్న నేపథ్యంలో, బిడ్డ కోసం దాదాపు 100 కోట్ల తో ఓ బహుమతిని రెడీ చేశారట ఈ బాలీవుడ్వి జంట.

రణ్‌వీర్ సింగ్ - దీపికా పెళ్లి

బాలీవుడ్ స్టార్ జంట దీపికా - రణ్‌వీర్ సింగ్ బాజీరావు మస్తానీ, రామ్ లీలా, పద్మావత్ వంటి సినిమాల్లో  వరుసగా నటించినప్పుడు, వారిద్దరూ ప్రేమలో పడ్డారు. తరువాత వీరిద్దరూ 2018లో ఇటలీలో తమ తల్లిదండ్రుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్ళి  చేసుకున్నారు.
 

దీపికా పదుకొణే 1000 కోట్ల సినిమాలు

పెళ్లి తర్వాత ఇద్దరూ నటనపై దృష్టి సారించారు. పెళ్లి తర్వాత దీపికా పదుకొణే, షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన పఠాన్, జవాన్ చిత్రాలు 1000 కోట్ల క్లబ్‌లో చేరాయి. అదేవిధంగా ప్రభాస్‌తో కలిసి నటించిన కల్కి 2898 AD, రితిక్ రోషన్ జంటగా నటించిన ఫైటర్ వంటి చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెస్సీ కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. 

ప్రభాస్ ఇంట్లో ఆ వంట చాలా స్పెషల్.. సెలబ్రిటీలు సైతం లొట్టలేసుకుని తినే ఆ ఫుడ్ ఏంటో తెలుసా..?


దీపికా పదుకొణే గర్భం:

గత ఫిబ్రవరిలో, దీపికా పదుకొణే తాను గర్భవతి అని ప్రకటించి అభిమానులకు సర్ ప్రైజ్  ఇచ్చింది, ఆ తర్వాత ఆమె తన షూటింగ్‌ల నుండి పూర్తిగా విరామం తీసుకుని పూర్తి విశ్రాంతి తీసుకుంటోంది. అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే కనిపిస్తోంది.

నాగ చైతన్య తల్లి లక్ష్మి రెండో పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా..?

కొత్త ఇల్లు కొన్న రణ్‌వీర్ - దీపికా:

ఇంకా కొన్ని నెలల్లో అందమైన బిడ్డకు తల్లి కాబోతున్న దీపికా పదుకొణే, తన బిడ్డను స్వాగతించడానికి 100 కోట్ల విలువైన కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఇల్లు బాంద్రా లో ఉందని, నటుడు షారుఖ్ ఖాన్ మన్నత్ ఇంటికి చాలా దగ్గరగా ఈ ఇల్లు ఉందని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ హోస్ట్ గా ఈటీవీలో భారీ రియాల్టీ షో.. ఎలా మిస్ అయ్యిదంటే..?

షారుఖ్ ఇంటి దగ్గర రణ్‌వీర్ - దీపికా

వీరు కొనుగోలు చేసిన కొత్త ఇంటికి సంబంధించి ప్రస్తుతం వెలువడిన సమాచారం ప్రకారం, సముద్ర తీర అందాలను వీక్షించేలా ఈ ఇల్లు నిర్మించబడింది, 11,266 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది... ఇందులో వీరి ఇల్లు 1,300 లో ఉందని... ఈ భవనంలో 16 నుండి 19వ అంతస్తు వరకు దీపికా - రణ్‌వీర్ ఇల్లు ఉందని సమాచారం. 
 

రణ్‌వీర్ - దీపికా ఇల్లు

ఈ నాలుగు అంతస్తుల్లో వారి జిమ్, స్విమ్మింగ్ పూల్, టెర్రస్ గార్డెన్, విజిటర్ రూమ్ తదితర సదుపాయాలు ఉన్నాయి. 2021లో అలీబాగ్‌లో 22 కోట్ల రూపాయలకు బంగ్లా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తమ బిడ్డ కోసం కొనుగోలు చేసిన ఈ ఇంట్లో బిడ్డ పుట్టిన తర్వాత గృహ ప్రవేశం చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Latest Videos

click me!