నాగ చైతన్య తల్లి లక్ష్మి రెండో పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా..?

First Published | Aug 30, 2024, 1:54 PM IST

నాగర్జునను విడాకులు తీసుకున్న తర్వాత నటుడు నాగ చైతన్య తల్లి లక్ష్మి ఎవరిని రెండో పెళ్లి చేసుకున్నారో తెలుసా..? 

నాగ చైతన్య, లక్ష్మి

టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు కింగ్  నాగార్జున. ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా సినిమాల్లో హీరోగా రాణిస్తున్నారు. సినిమాల్లో సక్సెస్ ఫుల్ నటులుగా వెలుగొందుతున్న ఈ ఇద్దరికీ వ్యక్తిగత జీవితం అనుకున్నట్లుగా ఉండలేదు. నాగార్జునలాగే ఆయన కుమారుడు నాగ చైతన్యకు కూడా మొదటి వివాహం విడాకుల్లో ముగిసింది. త్వరలో ఆయనకు రెండో వివాహం జరగనుంది.

తన తల్లితో నాగ చైతన్య

సమంత తో  విడాకులు తీసుకున్న తర్వాత   నాగ చైతన్య నటి శోభితా ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డారు. ఇటీవలే వీరిద్దరికీ నిశ్చితార్థం ముగిసింది. నాగ చైతన్య, నాగార్జున మొదటి భార్య కుమారుడు. నాగార్జున మొదట లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి జన్మించిన కుమారుడే నాగ చైతన్య. 1990 సంవత్సరంలో లక్ష్మి తో విడాకులు తీసుకొని విడిపోయారు నాగార్జున.


నాగ చైతన్య తల్లి లక్ష్మి

లక్ష్మిని విడిపోయిన తర్వాత నటుడు నాగార్జున నటి అమలాను రెండో వివాహం చేసుకున్నారు. నాగార్జునలాగే ఆయన మొదటి భార్య లక్ష్మి కూడా విడాకుల తర్వాత పునర్వివాహం చేసుకున్నారు. శ్రీరామ్ మోటార్స్ అనే సంస్థను నడుపుతున్న శరత్ విజయరాఘవన్‌ను ఆమె రెండో వివాహం చేసుకున్నారట. వివాహం తర్వాత లక్ష్మి తన భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారట.

లక్ష్మి తన రెండో భర్తతో

అంతేకాదు లక్ష్మి రెండో వివాహం ఇష్టం లేకనే నటుడు నాగ చైతన్య తన తల్లిని విడిచి తండ్రితో కలిసి ఉంటున్నారని ప్రచారం జరిగింది. కానీ అవన్నీ అసత్యాలని ఇటీవల జరిగిన నాగ చైతన్య - శోభిత జంట నిశ్చితార్థం ద్వారా తేలింది. ఈ నిశ్చితార్థ వేడుకకు తన రెండో భర్తతో కలిసి వచ్చి తన కుమారుడిని ఆశీర్వదించారు లక్ష్మి.

Latest Videos

click me!