Folk Song: 948 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్.. యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఫోక్ సాంగ్!

Published : Nov 02, 2026, 03:01 PM IST

Folk Song: ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. తక్కువ టైంలోనే కోట్ల వ్యూస్ సాధిస్తున్నాయి. అలా 95 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్ సృష్టిస్తోంది ఓ తెలుగు ఫోక్ సాంగ్. ఇంతకీ ఆ పాట ఏంటి? ఇంత హిట్ కావడానికి కారణాలేంటో చూద్దాం.

PREV
14
యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న ఫోక్ సాంగ్

సాధారణంగా సినిమా పాటలు యూట్యూబ్‌లో వందల కోట్ల వ్యూస్ సాధించడం చూస్తుంటాం. కానీ ఒక తెలుగు ఫోక్ సాంగ్ కూడా అదే స్థాయిలో దూసుకుపోవడం నిజంగా ఆశ్చర్యమే. భారీ బడ్జెట్ కాదు, స్టార్ హీరోలు, హీరోయిన్లు లేరు.. అయినప్పటికీ కోట్లాది మంది ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది ఆ పాట. జానపదంలోని మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. మరి ఆ పాట ఏంటి, దాని విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

24
రాను బొంబాయికి రాను ఫోక్ సాంగ్

“అద్దాలా మేడలున్నయే.. మేడల్లా మంచి చీరులన్నయే.. చీరంచూ రైకలున్నయే… కొనిపిస్తా నాతో బొంబాయ్ రాయే.. రాను… నే రాను.. బొంబాయికి రాను”.. అనే ఫోక్ సాంగ్ వినని వాళ్లు ఉండరు. యూట్యూబ్ లో ఈ పాటకు 948 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంటే దాదాపు 95 కోట్ల మంది ఈ పాటను వీక్షించారు. ఒక తెలుగు జానపద గీతానికి ఈ స్థాయిలో ఆదరణ లభించడం నిజంగా విశేషమనే చెప్పాలి.

తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ పాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరుతున్నాయి. ముఖ్యంగా పల్లెటూరి యాస, స్థానికంగా వాడే పదాలు, సహజమైన సంగీతం, యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే 'రాను బొంబాయికి రాను' పాట కూడా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ అలరిస్తోంది.

34
పాట ఇంత హిట్ కావడానికి కారణం?

ఈ ఫోక్ సాంగ్ ఇంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణం దాని సాహిత్యం, సంగీతం. ప్రముఖ ఫోక్ సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్ ఈ పాటకు సాహిత్యం అందించడంతో పాటు పాట కూడా పాడారు. ఆయనతో పాటు సింగర్ ప్రభ కూడా ఈ పాటను ఆలపించారు. లిఖిత, రాము రాథోడ్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. కళ్యాణ్ కీస్ సంగీతాన్ని అందించగా, శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ చేశారు. పాటలోని పదాలు, ట్యూన్, డ్యాన్స్ స్టెప్పులు అన్నీ కలిపి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఉండే సహజత్వం ఈ పాటకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది.

44
పాట బడ్జెట్ ఎంతంటే?

ఈ పాట బడ్జెట్ కూడా చాలా తక్కువే. పల్లెటూరి వాతావరణంలో ఈ పాటను రూపొందించారు. ఈ పాట నిర్మాణానికి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఇంత తక్కువ బడ్జెట్‌తో రూపొందిన పాటకు వందల కోట్ల వ్యూస్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పెళ్లిళ్లు, పండగలు, జాతరలు, కాలేజీ వేడుకలు ఇలా ఎక్కడ చూసినా ఈ పాట మారుమోగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories