Ranabaali OTT: త్వరలో ఓటీటీలోకి రణబాలి, రిలీజ్ డేట్ ఇదే ?.. థియేటర్స్ లో యావరేజ్, మరి ఇక్కడ రిజల్ట్ ఏంటో

Published : Nov 02, 2026, 01:54 PM IST

విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన రణబాలి చిత్రం థియేటర్స్ లో యావరేజ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ త్వరలో ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
13
నవంబర్ 13న ఓటీటీలోకి రణబాలి?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం ‘రణబాలి’. దసరా పండుగ సందర్భంగా గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ పీరియాడికల్ డ్రామాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. బ్రిటిష్ పాలన కాలం నాటి రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో విజయ్ దేవరకొండ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడే యోధుడి పాత్రలో కనిపించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌కు మించిన వసూళ్లు సాధించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత థియేటర్లలో విడుదలైన తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం.

23
నెట్‌ఫ్లిక్స్ పోస్ట్‌తో ఓటీటీ రిలీజ్ డేట్‌పై చర్చ

థియేటర్లలో విడుదలైన ‘రణబాలి’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీకి సంబంధించిన సమాచారం తాజాగా బయటకు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన సోషల్ మీడియా ఖాతాలో ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీని ప్రస్తావిస్తూ ఓ పోస్ట్‌ చేసింది. అయితే కొద్దిసేపటికే ఆ పోస్ట్‌ను తొలగించింది. తొలగించిన ఆ పోస్టులో సినిమా నవంబర్ 13, 2026 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొన్నారని సమాచారం. దీంతో విజయ్ దేవరకొండ అభిమానుల్లో సినిమా ఓటీటీ విడుదలపై ఆసక్తి నెలకొంది.

33
థియేటర్లలో విడుదలైన 28 రోజులకు ఓటీటీలోకి

సాధారణంగా తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంటాయి. ‘రణబాలి’ ఇప్పటికే థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా అక్టోబర్ 16, 2026న థియేటర్లలో విడుదలైంది. ఆ లెక్కన నవంబర్ 13న ఓటీటీలోకి వస్తే, థియేటర్లలో విడుదలైన 28 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్‌ కానుంది. అయితే నెట్‌ఫ్లిక్స్ ఇండియా సోషల్ మీడియాలో పోస్ట్‌ను తొలగించిన నేపథ్యంలో ఈ తేదీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు సినిమా ఓటీటీ విడుదల తేదీని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ధ్రువీకరించలేదు.

Read more Photos on
click me!

Recommended Stories