Animal Movie Collections: మూడు రోజుల్లో అన్ని వందల కోట్లా... కుమ్మేస్తున్న యానిమల్!

Published : Dec 04, 2023, 03:06 PM IST

ఏడాది చివర్లో వచ్చి ప్రభంజనం సృష్టిస్తుంది యానిమల్ మూవీ. రన్బీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కిన యానిమల్ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది.   

PREV
17
Animal Movie Collections: మూడు రోజుల్లో అన్ని వందల కోట్లా... కుమ్మేస్తున్న యానిమల్!

ఒక్కో హీరోకి సందీప్ రెడ్డి వంగ మరపురాని విజయం ఇస్తున్నాడు. అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ చేశాడు. స్టార్ హీరోల సరసన నిలబెట్టాడు. అదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి షాహిద్ కపూర్ కి కెరీర్ బెస్ట్ ఇచ్చాడు. కబీర్ సింగ్ మూడు వందల కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది. 
 
27

షాహిద్ కెరీర్లో వంద కోట్ల చిత్రం లేదు. పద్మావత్ మూడు వందల కోట్లు సాధించినా క్రెడిట్ షాహిద్ కపూర్ ఒక్కడికే దక్కదు. ఇప్పుడు రన్బీర్ కపూర్ వంతు. రన్బీర్ కెరీర్లో సంజు రూ. 342 కోట్లతో కెరీర్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా ఉంది. ఈ రికార్డుని యానిమల్ మూడు రోజుల్లో తుడిపెట్టింది. 

37

విడుదలైన అన్ని ఏరియాల్లో యానిమల్ ప్రభంజనం సృష్టిస్తుంది. వీకెండ్ ముగిసే నాటికి యానిమల్ వరల్డ్ వైల్డ్ రూ. 356 కోట్ల గ్రాస్ రాబట్టింది. హిందీతో పాటు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్లో యానిమల్ కి ఊహించని రెస్పాన్స్ దక్కుతుంది. 

47

హిందీ వెర్షన్ మూడు రోజులకు రూ. 178.5 కోట్లు రాబట్టింది. హిందీ తర్వాత తెలుగు వెర్షన్ కి ఆదరణ ఎక్కువగా ఉంది. మూడు రోజులకు తెలుగు రాష్ట్రాలలో రూ. 40 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక తమిళనాడులో రూ. 4.45 కోట్లు, కర్ణాటకలో రూ. 16.75 కోట్లు రాబట్టింది. 

57
Animal Movie Review

కేరళలో రూ. 1.38 కోట్లు రాబట్టింది.  ఓవర్సీస్ లో యానిమల్ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ దక్కుతుంది. నార్త్ అమెరికాలో మూడు రోజుల్లో $6 మిలియన్ మార్క్ దాటేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ దేశాల్లో రికార్డు వసూళ్లు నమోదు అవుతున్నాయి. మొత్తంగా ఓవర్సీస్ లో యానిమల్ రూ. 115.05 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. 

67

వరల్డ్ వైడ్ వీకెండ్ ముగిసే నాటికి యానిమల్ రికార్డు స్థాయిలో రూ. 356 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. యూఎస్, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే లాభాలు మొదలయ్యాయి. యూఎస్ లో $ 4 మిలియన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. ఇక తెలుగు రాష్ట్రాల హక్కులకు దిల్ రూ. 14 కోట్లు చెల్లించారని సమాచారం. దిల్ రాజుకు యానిమల్ కనక వర్షం కురిపించనుంది. 

77

Read more Photos on
click me!

Recommended Stories