ఆడియన్స్ మాత్రం ఇది రొటీన్ పొలిటికల్ డ్రామా అంటున్నారు. అక్కడక్కగా ఆలోచింపజేసే సన్నివేశాలు ఉన్నాయి. అదే సమయంలో దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నాడు . వాస్తవాలకు దూరంగా చాలా సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు.
సీఎం పై హత్యాయత్నం, సీబీఐ పనితీరు సిల్లీగా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ రొటీన్, కమర్షియల్ ఫార్మటులో నడిపారని అభిప్రాయ పడుతున్నారు. జర్నలిస్ట్ పాత్రలో నారా రోహిత్ మెప్పించాడని ఆడియెన్స్ పాజిటివ్ గా స్పందించారు.
మొత్తంగా చెప్పాలంటే ప్రతినిధి 2 ఎన్నికల వేళ ప్రతి పౌరుడు బాధ్యత తెలియజేసే చిత్రం. అయితే కథ, కథనాలు చాలా రొటీన్ గా ఉంటాయి. ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే మలుపులు లేవు. ప్రతినిధి 2 ఒక సాదాసీదా పొలిటికల్ డ్రామా అని ప్రేక్షకుల అభిప్రాయం.