రణ్ బీర్ మాట్లాడుతూ.. “అమ్మాయిలతో స్నేహం అబ్బాయిలకి అర్థం కాదు. నాకు తెలిసిన ఒక అబ్బాయి అనుష్కతో స్నేహం చేస్తూ ప్రేమలో పడ్డాడు. కానీ ఆమె వాడిని ఫ్రెండ్ జోన్ చేసింది” అని రణ్‌బీర్ అన్నాడు. “ఆ అబ్బాయి ఇంటిపేరు కూడా కపూర్” అని కూడా అన్నాడు.
దాంతో రణ్ బీర్ అనుష్కను ప్రేమించి ఉంటాడు అని అంతా అనుకున్నారు. కాని అనుష్కఅతన్ని ఫ్రెండ్ గానే చూడటంతో.. తన ప్రమను బయటపెట్టలేక ఇలా ఇన్ డైరెక్ట్ గా చెప్పి ఉంటాడు అనుకున్నారు. ఆతరువాత రణ్ బీర్ ఆలియా ప్రేమలో పడ్డాడు.
Also Read: 5 ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ సర్ప్రైజ్, పుష్ప 3 ఇప్పట్లో లేనట్టేనా..?
ఇక అనుష్క శర్మ 2017 డిసెంబర్‌లో ఇటలీలో విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుంది. వారికి వామిక అనే కూతురు, అకాష్ అనే కొడుకు ఉన్నారు. రణ్‌బీర్ కపూర్ ఆలియా భట్‌ను పెళ్లి చేసుకుని రాహా కపూర్ అనే కూతురుని కలిగి ఉన్నాడు.