ఏడాదిన్నర కూతురికి ఏకంగా బంగ్లా రాసిచ్చిన రణ్ బీర్ కపూర్, కాస్ట్ ఎంతో తెలుసా..?

Published : Mar 30, 2024, 11:46 AM IST

స్టార్లు తమ వారసులకు ఆస్తులు రాసివ్వడం సహజమే.. అది ధనవంతుల ఇళ్ళళ్లో జరిగే ప్రక్రియే. అయితే అది వారి పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక జరుగుతుంది. కాని పట్టుమని రెండేళ్లు రాకముందే.. తన కూతురికి ఆస్తి రాశాడు బాలీవుడ్ హీరో.. 

PREV
17
ఏడాదిన్నర కూతురికి ఏకంగా బంగ్లా రాసిచ్చిన రణ్ బీర్ కపూర్, కాస్ట్ ఎంతో తెలుసా..?

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ గురించి స్పెషల్ గా చెప్పేది ఏముంది. ఇద్దరు బాలీవుడ్ స్టార్ వారసులు, తమకంటూ స్పెషల్ ఇమేజ్ ఉన్నస్టార్స్.. మొన్నటి వరకూ బాలీవుడ్ కే పరిమితం అయిన ఈ జంట స్టార్ డమ్..  ప్రస్తుతం టాలీవుడ్ కు కూడా పాకింది. ఇక్కడ కూడా వారికి  మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. 

27

దాదాపు 5 ఏళ్ళు డేటింగ్ చేసుకున్న తరువాత వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయిన వెంటనే ఆలియా ప్రెగ్నెంట్ అవ్వడం.. వీరి ప్రేమకు ప్రతిరూపంగా..  2022 పాప కూడా పుట్టింది. ఆ పాపకు  రహ అనే పేరు కూడా పెట్టారు జంట.  ముత్తాత రాజ్ కపూర్‌ పోలికలతో పుట్టినందుకు.. ఆ పాపకు  రహ అనే పేరు పెట్టారు. 

37

ఇక ఈ పాప  తన క్యూట్ లుక్స్ తో అందర్నీ ఫిదా చేసేస్తుంది. ఇది ఇలా ఉంటే.. పెద్ద అయిన తరువాత వారసులకు వారి పేరు మీద ఆస్తులు రాయడం కామన్. కాకపోతే.. రహాకు ఏడాదిన్నర వయస్సు ఉండగానే.. రణ్‌బీర్ తన కూతురికి భారీ బహుమతిని ఇచ్చారు.

47

ముంబై బాంద్రాలోని తాము నివసించే కృష్ణ రాజ్ బంగ్లాని రణ్‌బీర్ తన కూతురి పేరు మీద రాసేశారు. దాని విలువ అక్షరాలా 250 కోట్లు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ బంగ్లాల కంటే కూడా  ఈ బంగ్లా ధర ఎక్కువే. ఇక ఈ బంగ్లాని రణ్‌బీర్ తన పేరు మీద రాయడంతో.. బాలీవుడ్ లోనే యంగెస్ట్ రిచ్ కిడ్ గా రహ నిలిచింది. 
 

57

అంతే కాదు ఇండియాలోని స్టార్ కిడ్స్ లో ఏడాదిన్నర వయసులోనే రహ 250 కోట్లకు యజమాని అయ్యింది. కాగా రణ్‌బీర్ అండ్ అలియాకి ఈ బంగ్లాతో పాటు మరో నాలుగు బంగ్లాలు కూడా ఉన్నాయి. అయితే వాటి విలువ మొత్తం 100  కోట్ల వరకూ  ఉంటుందని అంచనా.. 

67

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు రణ్ బీర్ కపూర్. రీసెంట్ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రణ్ బీర్... ప్రస్తుతం రామాయణం కథలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ యమా జోరుగా సాగుతున్నాయి. రీసెంట్ గా వాటికి సబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. 

77

రాముడిగా నటించేందుకు రణ్‌బీర్ ప్రస్తుతం అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతున్నాడు. గుర్రం స్వారీతో పాటు, విలువిద్యలు నేర్చుకుంటున్నారు. మూడు భాగాలుగా తెరకెక్కబోతున్న రామాయణ్ సినిమాను నితేశ్‌ తివారీ తెరకెక్కించనున్నారట. ఇక సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా కేజీఎఫ్ హీరో యశ్ నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories