BrahmaMudi 30th march Episode: ఇక రాజ్, కావ్యలు బాబుని తీసుకొని ఆఫీసుకు వెళతారు. బాబుని రాజ్ ఎత్తుకొని లోపలికి వెళ్లడం ఆలస్యం.. అందరూ విస్తుపోయి చూస్తారు. డిజైనర్ శ్రుతి అయితే.. ఏకంగా బాబు ఎవరు సార్ అని అడుగుతుంది. దానికి సమాధానం చెప్పకుండా.. పని చెయ్యమని రాజ్ సీరియస్ అవుతాడు. సేమ్ శ్రుతి లాగానే మరో వ్యక్తి కూడా బాబు గురించి ఆరా తీస్తాడు. అయితే... రాజ్ కన్నా ముందే శ్రుతి రియాక్ట్ అయ్యి.. సమాధానం చెప్పనివ్వదు.
ఇక.. పక్కకు వచ్చిన తర్వాత.. ఆ బాబు రాజ్ సర్ బాబు అయ్యి ఉంటాడు అని శ్రుతి అంటుంది. కావ్య మేడమ్ ప్రెగ్నెంట్ కాదు కదా అని అతను అంటే.. మగవాడు తండ్ర అవ్వాలంటే.. భార్య మాత్రమే ప్రెగ్నెంట్ అవ్వాల్సిన అవసరం లేదని.. ఎవరు ప్రెగ్నెంట్ అయినా పర్లేదు అని అంటుంది. ఆ మాటలు కావ్య చెవిన పడతాయి. దీంతో.. వెంటనే శ్రుతిపై సీరియస్ అవుతంది. తెలీకుండా.. ఎవరి క్యారెక్టర్ తక్కువ చేయకూడదు అని తిడుతుంది.