Ranabaali Collection: విజయ్ దేవరకొండకు షాక్, రెండోవరోజు తగ్గిన రణబాలి కలెక్షన్స్, వీకెండ్ కలిసొస్తుందా?

Published : Oct 18, 2026, 07:21 AM IST

Ranabaali Collection: భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది రణబాలి సినిమా. విజయ్, రష్మిక పెళ్లి తర్వాత నటించిన సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఫస్ట్ డే భారీ వసూళ్లు సాధించిన ఈమూవీ.. రెండో రోజు మాత్రం షాక్ ఇచ్చింది.

PREV
14
రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్లు..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. ఈ సినిమాలో థియేటర్లలో సక్సెస్ పుల్ గా తన బాక్సాఫీస్ జర్నీని కొనసాగిస్తోంది. అక్టోబర్ 16, 2026 శుక్రవారం నాడు గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను రాబడుతోంది. రెండవ రోజు శనివారం (అక్టోబర్ 17) దేశీయంగా ఈ సినిమా వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, రెండు రోజుల ముగింపు సమయానికి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సొంతం చేసుకుంది.

రెండు రోజుల వసూళ్ల వివరాలు

ట్రాకింగ్ వెబ్‌సైట్ సాక్నిల్క్ (Sacnilk) నివేదికల ప్రకారం, 'రణబాలి' సినిమా రెండవ రోజు శనివారం భారత్‌లో రూ. 7.30 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. మొదటి రోజు సాధించిన రూ. 9.25 కోట్ల నెట్ వసూళ్లతో పోలిస్తే ఇది 21.1 శాతం తగ్గుదలను సూచిస్తోంది. దీనితో మొదటి రెండు రోజులకు గాను భారతీయ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొత్తం రూ. 16.55 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇక దేశీయంగా గ్రాస్ వసూళ్ల విషయానికి వస్తే ఇది రూ. 19.25 కోట్లకు చేరుకుంది.

24
ఓవర్సీస్ లో రణబాలి ఎంత రాబట్టిందంటే?

విదేశీ మార్కెట్లలో కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. శనివారం ఓవర్సీస్ నుండి రూ. 2 కోట్లు రాగా, రెండు రోజుల మొత్తం విదేశీ గ్రాస్ వసూళ్లు రూ. 7.40 కోట్లకు చేరాయి. దేశీయ , అంతర్జాతీయ వసూళ్లను కలుపుకుని రెండు రోజుల్లో 'రణబాలి' ప్రపంచవ్యాప్తంగా రూ. 26.65 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 16.50 కోట్ల గ్రాస్ సాధించిన సంగతి తెలిసిందే.

34
ఆక్యుపెన్సీ - థియేటర్ల వివరాలు

రెండవ రోజు శనివారం నాడు ఈ చిత్రం 2,292 షోల ద్వారా రూ. 7.30 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. మొదటి రోజు శుక్రవారం ఈ సినిమా 2,515 షోలలో ప్రదర్శించబడింది. థియేటర్ల ఆక్యుపెన్సీ కూడా మొదటి రోజు నమోదైన 57 శాతం నుండి రెండవ రోజున 53 శాతానికి స్వల్పంగా తగ్గింది. మొత్తంగా రెండవ రోజున ఈ సినిమాకు 5,51,946 ఫుట్‌ఫాల్స్ నమోదయ్యాయి. దీంతో రెండు రోజుల్లో మొత్తం ఫుట్‌ఫాల్స్ సంఖ్య 12,63,625 కు చేరింది. తెలుగు 2D వెర్షన్ శనివారం రోజున 51.81 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

వివిధ షోల వారీగా చూస్తే:

మార్నింగ్ షోలు: 27.15%

మ్యాటినీలు (మధ్యాహ్నం): 59.15%

ఈవినింగ్ షోలు: 52.69%

నైట్ షోలు: 65.77% (రోజు మొత్తంలో అత్యధిక ఆక్యుపెన్సీ నైట్ షోలలోనే నమోదైంది)

44
రాష్ట్రాల వారీగా వసూళ్లు

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో 'రణబలి' సాధికారిక ప్రతిభను కనబరిచింది. శనివారం ఒక్క రోజే ఈ రెండు రాష్ట్రాల నుంచి రూ. 7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే, కర్ణాటకలో రూ. 1.08 కోట్లు, తమిళనాడులో రూ. 17 లక్షలు నమోదు కాగా, భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి రూ. 25 లక్షలు వచ్చాయి. దీంతో రెండవ రోజు రాష్ట్రాల వారీగా మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 8.50 కోట్లుగా నమోదయ్యాయి.

వీకెండ్ - దసరా కలిసొస్తుందా?

ఈ వీకెండ్ శనివారం ఎలాగు కలెక్షన్స్ తగ్గాయి.. జైలర్ 2 ప్రభావం ఈసినిమాపై బాగా కనిపిస్తోంది. ఈ ఆదివారంతో పాటు దసరా సెలవులు, పండగ ప్రభావం రణబాలిపై ఎలా ఉంటుందో చూడాలి. ఈ సెలవులతో థియేటర్లకు జనాలు బాగా వస్తే.. రణబాలికి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చారిత్రక డ్రామా చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందించారు. 1876-1878 నాటి మద్రాసు కరువు (మహా కరువు) సమయంలో రాయలసీమ ప్రాంత నేపథ్యంగా ఈ కథ సాగుతుంది. బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గుర్రపు రౌతు కథాంశంతో 'రణబలి' రూపుదిద్దుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ రణబాలిగా నటించగా, రష్మిక మందన్న జయమ్మ అనే పాత్రలో నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories