ఇండస్ట్రీలో ఈ అనిశ్చితి చాలా కాలం ఉంటుంది: రానా దగ్గుబాటి

First Published Jul 3, 2020, 5:52 PM IST

రానా ఆలోచన ప్రకారం ప్రస్తుతం ప్రపంచమంతా మానసికంగా ఆర్దికంగా ఇంకా చాలా రకాలుగా ఇబ్బంది పడుతుందని అభిప్రాయ పడ్డాడు. కానీ ఈ సమయం కళాకారులకు చాలా ఉపయోగపడుతుంది. ఆసక్తికర కథలతో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఇదే సరైన సమయం.

శుక్రవారం సీఐఐ లైఫ్‌ స్టైల్‌, వెల్‌నెస్‌ సమిట్‌ వెబినార్‌లో పాల్గొన్న రానా దగ్గుబాటి సినిమా, లైఫ్‌ స్టైల్‌, హెల్త్‌ సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. డాక్టర్‌ జలచారి ఎల్ల అధ్యక్షతన సాగిన ఈ వెబినార్‌లో ఇంట్రస్టింగ్ ప్రశ్నలకు రానా దగ్గుబాటి అంతే ఆసక్తికర సమాధానాలు చెప్పాడు.
undefined
రానా ఆలోచన ప్రకారం ప్రస్తుతం ప్రపంచమంతా మానసికంగా ఆర్దికంగా ఇంకా చాలా రకాలుగా ఇబ్బంది పడుతుందని అభిప్రాయ పడ్డాడు. కానీ ఈ సమయం కళాకారులకు చాలా ఉపయోగపడుతుంది. ఆసక్తికర కథలతో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ సమయంలో భవిష్యత్తుకు సంబంధించి కొత్త ఆలోచనలతో ఈ విపత్కర పరిస్థితులను దాటాల్సిన అవసరం ఉంది.
undefined
ఈ రోజు మనకు ఓటీటీ లాంటి ప్లాట్ ఫామ్స్ ద్వారా కంటెంట్‌ క్రియేట్‌ చేసే అవకాశం ఉంది. మనం ఎక్కడ ఉన్నాం అన్నది కాదు. టాలెంట్‌ ఉన్న వాళ్లు ఇప్పుడు ఏదో ఒక ప్లాట్‌ ఫాంలో ప్రూవ్‌ చేసుకోవచ్చు. ఓటీటీ అనేది ఇండిపెండెంట్‌ ఫిలిం మేకర్స్‌కు మంచి అవకాశం. ఇప్పటికే ఆన్‌లైన్‌లో చాలా మంచి కంటెంట్ వస్తోంది. థియేటర్లో సినిమా అనేది ఓ గొప్ప అనుభూతి అది ఎప్పటికీ ఉంటుంది.
undefined
ఈ విపత్కర సమయంలో సినీ రంగంలో అనిశ్చితి మరికొంత కాలం కొనసాగుతుందని అభిప్రాయ పడ్డాడు రానా. అందుకే తాను ప్రస్తుతం ఏ సినిమాలు అంగీకరించటం లేదు అని చెప్పాడు. అదే సమయంలో రానున్న రెండేళ్లలో యానిమేషన్ సినిమాలను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపాడు.
undefined
click me!