ఏడేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య: సాయి పల్లవి ఆవేదన

First Published Jul 3, 2020, 3:26 PM IST

తమిళనాట వరుసగా వివాదాస్పద సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే తూత్తుకుడి జిల్లాలో జయరాజ్‌, బెనిక్స్ అనే తండ్రి కొడుకులను లాకప్‌ డెత్‌ చేసిన సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తుతున్న తరుణంలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది.

ఏడేళ్ల చిన్నారిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనపై నిరసనలు వెళ్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఓ బాలిక దారుణమైన పరిస్థితుల్లో హత్యకు గురైంది. ఈ సంఘటనపై సెలబ్రిటీలు కూడా ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
undefined
ఈ సంఘటనతో చెలించిపోయిన సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. `మనుషుల మీద నమ్మకం వేగంగా పోతోంది. బలహీనులకు సాయం చేయటం కోసం మనకు ఇచ్చిన శక్తి పూర్తిగా దుర్వినియోగం అవుతుంది. బలహీనులో ఎక్కువగా దాడులకు గురవుతున్నారు. రాక్షసవాంచ తీర్చుకోవడానికి చిన్నారులను కూడా బలి చేస్తున్నాం.
undefined
ఒక్కో రోజు గడుస్తున్న కొంది మన జాతీ మొత్తాన్ని క్లీన్ చేయాల్సిన పరిస్థితి దగ్గర పడుతుందని అర్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితులు చూస్తు నిరుపయోగంగా బతికే కన్నా జాతీని క్లీన్ చేయటమే కరెక్ట్. మానవత్వం లేని వారికి ప్రపంచానికి మరో బిడ్డకు జన్మనిచ్చే హక్కు లేదు.
undefined
అన్యాయం జరిగిన విషయం అందరికీ తెలిసే లోపు, ఆ విషయం సోషల్ మీడియా ట్రెండ్ అయ్యేలోపే బాదితులకు న్యాయం జరిగే రోజు రావాలని ప్రార్థిస్తున్నా. అసలు మీడియాలోకి రానివి, ప్రపంచం గుర్తించని నేరాలు ఇంకా ఎన్ని జరుగుతున్నాయో..?
undefined
ఎన్నో అన్యాయాలు జరుగుతున్న మన దేశంలో ఓ దారుణం గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే ఓ హ్యాష్ టాగ్ వాడటం తప్పని సరి అయ్యింది. అంటూ #JusticeforJayapriya అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించింది సాయి పల్లవి.
undefined
click me!