టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇటీవల తన ప్రేమను మిహీకా బజాజ్ అంగీకరించింది అంటూ ప్రకటించిన భల్లాల దేవుడు, ఈ ఆగస్టులోనే మూడు మూళ్లు వేసేందుకు సిద్ధమయ్యాడు. ఆగస్టు 8న ఇరు కుటుంబాల పెద్దల సమక్ష్యం కోవిడ్ నింబంధనలకు అనుుణంగా రానా, మిహీకాల వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూల ఇచ్చాడు రానా. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
undefined
ఇంటర్వ్యూలో భాగంగా తనకు కాబోయే భార్య మిహీకా బజాజ్ గురించి, వారి ప్రేమ గురించి కూడా వివరించాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. `మిహీకా, మేం ఒకే ప్రాంతంలో ఉండేవాళ్లం. మా ఇంటికి వాళ్ల ఇంటికి మూడు కిలో మీటర్ల దూరం. తను అప్పుడప్పుడూ మా ఇంటికి వచ్చేది అనే తెలిపాడు.
undefined
పెళ్లి వయసు వచ్చింది. వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు ఇదే సరైన సమయం అనిపించింది. అందుకే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. జీవితంలో కొన్నిసార్లు మనం పెద్దగా ప్రయత్నం చేయకపోయినా వాటంతటవే జరిగిపోతుంటాయి. అలాంటి సందర్భంలో పెద్ద ఆలోచించకూడదు. కాలాన్ని ఫాలో అవుతూ వెళ్లిపోవటమే.
undefined
మిహీకా చాలా మంచిది. మా జంట చాలా గొప్ప జంటగా నిలుస్తుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరం గౌరవిస్తాం. ఆగస్టు 8న మా వివాహం జరగబోతుంది. మిహీకాను పెళ్లి చేసుకునే తరుణమే నా జీవితంలో గొప్ప సమయం. మా పెళ్లి గురించి ఆలోచించటమే చాలా ఆనందంగా ఉంది.
undefined
మిహికా, వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితకు క్లాస్‌మెట్. తను తరుచూ వెంటేష్ ఇంటికి వస్తుండటంతో రానాకు పరిచయం అయ్యింది. అయితే లాక్‌డౌన్‌కు ముందే మిహికా యస్ చెప్పడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మే 12న రానా మిహికాతో ఉన్న ఫోటోను షేర్ చేసి.. తన ప్రేమ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
undefined
ఆ తర్వాత మే 21న వారి రోకా వేడుక రామానాయుడు స్టూడియోలో ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. రానా మాట్లాడుతూ.. `కొన్ని నెలల క్రితం.. మిహీకా తిరిగి కాంటాక్ట్‌లోకి వచ్చింది. అప్పుడే లైఫ్‌లాంగ్ ఆమెతో సంతోషంగా ఉంటానని అర్థమయ్యింది. తను మొదట షాక్ అయినా.. ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది` అని చెప్పాడు రానా.
undefined