వర్మ 'ప‌వ‌ర్ స్టార్‌' మూవీ రివ్యూ!

First Published | Jul 25, 2020, 3:03 PM IST

యూట్యూబ్ లలో చాలా వీడియోలకు పెట్టిన హెడ్డింగ్ లకు లోపల కంటెంట్ కు కొంచెం కూడా సంభంధం ఉండదు. ఆవేశపడో..అత్రుత చెందో  ...ఆ లింక్ ఓపెన్ చేస్తే అక్కడ వాళ్లు చెప్పిన లింక్ లు ఏమీ ఉండవు. అంతా నాన్ సింక్ లో నడుస్తుంది. దాంతో  ఆ ఛానెల్ ని మళ్లీ చూడకూడదని ఒట్టు పెట్టుకుంటాం. వర్మ వరసపెట్టి చేస్తున్న సినిమాల పరిస్దితి కూడా అలాగే ఉంది. టైటిల్, ట్రైలర్ లో ఉన్న కంటెంట్ తప్ప ఆ షార్ట్ ఫిలిం లు లాంటి సినిమాల్లో మ్యాటర్ ఏమీ ఉండటం లేదు. దాంతో ఆయనమీద నమ్మకం పోతుందో లేదో కానీ రిలీజ్ కు ముందు కొద్ది రోజులు మాత్రం ఎంటర్టైన్మెంట్ మాత్రం మిగులుతోంది. వర్మ తాజా చిత్రం 'ప‌వ‌ర్ స్టార్‌' కూడా ఎన్నో వివాదాలు మోసుకొచ్చింది. వర్మ మీదే సినిమాలు తీసేలా ప్రేరేపించింది..దాడులు కూడా చేసేందుకు దారిచ్చింది. నిజంగా 'ప‌వ‌ర్ స్టార్‌' లో అంత విషయం ఉందా..లేదా ఎప్పటిలాగే ఆయన మనలని ఛీట్ చేసారా...అసలు 'ప‌వ‌ర్ స్టార్‌' విషయం ఏమిటి..వర్మ ఏం చెప్పారు..ఏం చెప్పాలనుకున్నారు..ఫైనల్ కంక్లూజన్ ఏమిటో చూద్దాం. 

కథేంటి:టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో ప్ర‌వ‌ణ్ క‌ల్యాణ్. స్టార్ గా ఎదిగి... రాజ‌కీయాల్లో అడుగుపెడతాడు. అందుకోసం మన సేన అనే ఓ పార్టీని పెట్టి ఎన్నిక‌ల్లో నిలబడతాడు. ఘోరంగా ఓడిపోతాడు. తాను పోటీ చేసిన రెండు చోట్ల ఒక్క సీటూ గెల‌వ‌డు. దాంతో ప్రవణ్ కళ్యాణ్ ప్రస్టేషన్ పీక్స్ కు వెళ్తుంది. ఇంట్లో టీవీలు బ‌ద్ద‌లు కొడతాడు. అంతర్మధనంలో ఉంటాడు.
undefined
అయితే ఇతని పరిస్దితి ఇంట్లో వాళ్లెవరూ అర్దం చేసుకోరు..లేదా అర్దం కాదు. మొదట అతని అన్నయ్యలిద్దరూ ఓదార్చి, మళ్లీ గెలుస్తావు అని ఎంకరేజ్ చేయరు. ఓ అన్నయ్య స్టార్‌మెగా వచ్చి...`సినిమా వేదిక‌ల‌పై నేను నా త‌మ్ముడి అని చెప్పుకుంటావ్. రాజ‌కీయ స‌భ‌ల్లో మాత్రం నేను కానిస్టేబుల్ కొడుకుని అంటావు. నువ్వు ప‌వ‌ర్ స్టార్ అయ్యింది నా త‌మ్ముడిగానా? కానిస్టేబుల్ కొడుకుగానా` అయినా మళ్లీ హాయిగా సినిమాలు తీస్కో..నీకెందుకు ఈ రాజకీయాలు అంటారు.
undefined

Latest Videos


మరో ప్రక్క మరో అన్నగారు...ఎవరో తిట్టిన తిట్లను గుర్తు చేసి బాధపెడుతూంటాడు.ఇది చాలదన్నట్లు గండ్ల రమేష్ వచ్చి ...మీరు ఓడిపోతే నాకు డేట్స్ ఇస్తా...అలాగని మ్రొక్కుకున్నా అంటాడు. మరో ప్రక్క తనతో `జిజ్ఞాత‌వాసి` తీసిన దర్శకుడు ఈ గ్యాప్ లో సినిమా చేసేద్దాం అంటాడు. అతను రాసిచ్చిన స్పీచ్ ల వల్లే తను ఓడిపోయానని పవర్ స్టార్ మండిపతాడు.
undefined
మథ్యలో కత్తి మహేష్ ఇంటర్వూ..రష్యన్ భార్య తో సంభాషణ, పూణే నుంచి ఫోన్ ...ఇలా రకరకాలుగా ఉన్న సిట్యువేషన్ లో ఫైనల్ గా డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ వచ్చి కలుస్తాడు. ఇంతకీ వర్మ వచ్చి ఏం చేసాడు...ఏం చెప్పాడు...ప్రవణ్ వీళ్లలో ఎవరి మాట విన్నారు..ఏ డెసిషన్ తీసుకున్నారు అనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ...లెంగ్త్ తక్కువే కాబట్టి ఈ సినిమా చూడచ్చు.
undefined
ఎలా ఉంది..నిజానికిదో స్ఫూఫ్. ఓ రాత్రి ఓ రెండు గంటలు నలుగురు కూర్చుని ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుని రికార్డ్ చేసుకుని తెల్లారి దాన్ని సీన్స్ గా మార్చేసి, తెరకెక్కించినట్లున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పేరు చెప్పి క్యాష్ చేసుకుందామనే తాపత్రయం తప్ప...ఓ పొలిటికల్ సెటైర్ లా కూడా ఉండదు. అందరికి తెలిసి..సోషల్ మీడియాలో జనం రచ్చ చేసుకునే అంశాలు మాత్రమే కనపడతాయి. ఒక్క అంశం కూడా కొత్తది లేదు. అలాగే క్యారక్టర్స్ అన్నీ ఏదీ గెస్ట్ రోల్సే. వచ్చిన పాత్ర మళ్లీ రాదు. కథ..మలుపు అంటూ ఏమీ ఉండవు.
undefined
అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మీద కన్నా ఆయన రాసిన ఇజం పుస్తకంపై ఎక్కువ కోపం వెళ్లగక్కారు వర్మ. గాజు తేజ అనే అతను స్కూలు పిల్లాడి బుర్ర‌తో ఆలోచించి ఈ పుస్త‌కం రాశాడ‌ని, అదే ప‌వ‌న్ ని త‌ప్పుదారి ప‌ట్టించింద‌ని అన్నారు. తను ట్వీట్ చేసే వాటిన్నటిని గుది గుచ్చి ఈ సినిమా చేసారు.
undefined
మరేముంది సినిమాలో అంటే..మనకు తెలుసున్న వ్యక్తులను యాజటీజ్ పోలిన వాళ్లు వెతికి పట్టుకుని వర్మ చేసిన వీడియో ఇది. వాస్తవానికి వర్మ సినిమాలు మానేసి షార్ట్ ఫిలింలు తీస్తున్నారనే సంగతి మనకు నగ్నం, క్లైమాక్స్ లతో అర్దమైంది. సెక్స్, క్రైమ్, కాంట్రవర్శీలే తన ఫిల్మ్ లకు మూలధనం అని నమ్మి వాటినే పెట్టుబడిగా పెట్టి వరస పెట్టి వాయి తీస్తున్నారు. రిలీజ్ కు ముందు ఓ పెద్ద వివాదం క్రియేట్ చేయటం...ఆ తర్వాత తుస్సుమనిపించటం పరిపాటిగా మారింది.ఇక్కడే అదే జరిగింది. ఆవేశపడితే ఆయాశం తప్ప ఏమీ మిగలదు.
undefined
టెక్నికల్ గా..సాంకేతికంగా ఈ సినిమా చాలా మంది చేసే షార్ట్ ఫిల్మ్ ల స్దాయిలో కూడా ఉండదు. ఈ సినిమాలాంటి వీడియోని అతి తక్కువ ఖర్చుతో చుట్టేసారని స్పష్టంగా అర్దమవుతుంది. అలాగే డైలాగ్స్ గా ప్ర‌తీ సీన్‌లోనూ కొన్ని సెటైర్ పెట్టుకుంటూ వెళ్లిపోయారు. ఆ సెటైర్స్ అన్నీ ప‌వ‌న్ పై కాదు, బండ్ల గ‌ణేష్ పైనా,. త్రివిక్ర‌మ్ పై, నాగ‌బాబుపై, చిరంజీవి,చంద్రబాబు ఇలా అందరిపైనా వేసారు.
undefined
ఇక ప్ర‌వ‌న్ గా చేసిన న‌టుడు..పవన్ కళ్యాణ్ ని అనుకరించుకుంటూ వెళ్లాడు. క్లోజ‌ప్ లు పెట్టినప్పుడే తేడా కొట్టింది. చాలా వరకూ లాంగ్ షాట్స్ లో మ్యానేజ్ చేసేసారు. సినిమా క్లైమాక్స్ లో వ‌ర్మ తనలోని నటుడుని బయిటకు తీసారు. చిరు, బండ్ల గ‌ణేష్‌, త్రివిక్ర‌మ్.. ఇలా అంద‌రి డూప్ లతో లాగేసాడు. ఉన్న ఒక్క పాటా గడ్డి తిన్నావా...జస్ట్ ఓకే. దాదాపు ఎక్కువ భాగం ఒకే ఇంట్లో తీసేసారు కాబట్టి పెద్దగా టెక్నికల్ టీమ్ కు కూడా పనిలేదు.
undefined
ప్లస్ లుఈ సినిమా రన్ టైమ్ బాగా తక్కువ ఉండటం. అంతకు మించి అయితే భరించటం కష్టమయ్యేదిప్రవీణ్ కళ్యాణ్ వేసిన నటుడు...ఎక్కడా తడబడకుండా చేసుకుంటూ వెళ్ళటంవర్మ ఎంట్రీమైనస్ లుఅసలు విషయం ఏమీ లేకుండా చుట్టేయటం.ఫైనల్ ధాట్ఈ సినిమా పవన్ కళ్యాణ్ క్రేజ్ ని అడ్డం పెట్టి వర్మ సైతం క్యాష్ చేసుకున్నారు. ఎంతొచ్చినా అది పవన్ క్రెడిట్ తప్ప..వర్మ గొప్పతనం కాదు.Rating: 15--సూర్య ప్రకాష్ జోశ్యుల
undefined
click me!