పాత జ్ఞాపకాల్లో సీనియర్‌ నటి.. రేర్‌ ఫోటోలు షేర్ చేసిన శివగామి

First Published | Jul 25, 2020, 12:32 PM IST

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా యాక్టివిటీ పూర్తిగా ఆగిపోవటంతో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటి రమ్యకృష్ణ కూడా గతంలో తన ఫ్యామిలీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.

1983లో తన 13వ యేట నటిగా వెండితెరకు పరిచయం అయ్యింది రమ్యకృష్ణ.
undefined
ఆ తరువాత రమ్యకృష్ణ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 200 సినిమాల్లో నటించింది.
undefined
Tap to resize

30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న రమ్యకృష్ణ, నరసింహ సినిమాలోని నీలాంబరి పాత్రతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది.
undefined
కోలీవుడ్‌ స్టార్ హీరోలు, కమల్‌ హాసన్, విజయ్ కాంత్, శరత్‌ కుమారల్ లాంటి వారితో సూపర్‌ హిట్ సినిమాల్లో నటించింది రమ్యకృష్ణ.
undefined
సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్‌లోనూ కీలక పాత్రల్లో నటించింది రమ్య.
undefined
నరసింహ తరువాత రమ్యకృష్ణ జీవితాన్ని మలుపు తిప్పిన మరో సినిమా బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రంలో రమ్యకృష్ణ శివగామి పాత్రలో అత్యద్భుతంగా నటించింది.
undefined
బాహుబలి సినిమాతో ఆమె అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది.
undefined
ఇటీవల వందరాజవన్ తాన్‌ వరువెన్‌, దేవ్‌, సూపర్‌ డీలక్స్ సినిమాల్లో నటించింది రమ్యకృష్ణ.
undefined
50 ఏళ్లు దాటినా.. సూపర్‌ డీలక్స్ సినిమాల్లో హాట్ హాట్‌ డ్రెస్సుల్లో కనిపించి అలరించింది రమ్యకృష్ణ.
undefined
అయితే ఆమె తొలిసారిగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. తన సీమంతానికి సంబంధించి ఫోటోలను షేర్ చేసింది రమ్యకృష్ణ.
undefined

Latest Videos

click me!