ఒక్క హిట్టు కొట్టి సీనియర్ హీరోలపైనే సెటైర్లు.. ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ ఎవ్వరినీ వదల్లేదు

First Published | Nov 6, 2024, 11:39 AM IST

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన వారిలో కొంతమంది మాత్రమే పెద్దయ్యాక మంచి క్రేజ్ తెచ్చుకుంటారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందినప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడం కష్టం. ఆ కష్టాన్ని అధికమిస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతున్న హీరో తేజ సజ్జా.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన వారిలో కొంతమంది మాత్రమే పెద్దయ్యాక మంచి క్రేజ్ తెచ్చుకుంటారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందినప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడం కష్టం. ఆ కష్టాన్ని అధికమిస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతున్న హీరో తేజ సజ్జా. చిన్నతనంలో తేజ సజ్జా ఇంద్ర లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అదరగొట్టారు. పెద్దయ్యాక హీరోగా అవకాశాలు అందుకుంటున్నాడు. 

సమంత బేబీ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. జాంబీ రెడ్డి, అద్భుతం లాంటి చిత్రాలు తేజ సజ్జా గుర్తింపు పెంచాయి. హనుమాన్ చిత్రంతో అయితే తేజ సజ్జా ఏకంగా కుంభస్థలాన్నే బద్దలు కొట్టాడు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం తేజ సజ్జా మిరాయి అనే మరో పాలన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. 


ఇటీవల జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో తేజ సజ్జా హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటితో కలసి తేజ సజ్జా ఐఫా ఈవెంట్ లో హోస్ట్ గా చేశాడు. వేదికపై రానాతో కలసి తేజ సజ్జా చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అయితే తేజ సజ్జా కొందరు స్టార్ హీరోల చిత్రాలని చేసిన ఫన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రానా, తేజ సజ్జా ఇద్దరూ కలసి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టాలీవుడ్ లో జరిగిన హైలైట్స్ అంటూ రానా.. తేజ సజ్జాకి ఒక పేపర్ ఇచ్చి చదవమని చెప్పాడు. కాంట్రవర్సీ ఏమి లేదు కదా అని తేజ సజ్జా.. రానాని అడుగుతాడు. కాంట్రవర్సీ ఏమి ఉండదు అని రానా చెప్పడంతో.. అయితే రెచ్చిపోతా అని తేజ అంటాడు. 

Rana Daggupathi

పుష్ప 2 రిలీజ్ బాగా లేట్ అయింది కాబట్టి మూవీ టైటిల్ ని పుష్ప టూ లేట్ అని మార్చారు అని తేజ సజ్జా చదువుతాడు. వెంటనే నన్ను ఇరికిస్తున్నావు అన్నట్లుగా రానా వంక ఆశ్చర్యంగా చూస్తాడు. అదేం కాదులే.. తర్వాతది చదువు అని రానా అంటాడు. ఆదిపురుష్ సినిమాకి ప్రతి థియేటర్ లో ఒక సీట్ ఆంజనేయ స్వామికి వదిలేశారు. ఆంజనేయ స్వామి కూడా ఓటిటిలో చూద్దాం అని వదిలేశారు అని చదువుతాడు. ఇదేదో కాంట్రవర్సీ వ్యవహారం లా ఉంది.. నీయమ్మ నేనెళ్లిపోతా ఇక్కడి నుంచి అంటూ తేజ వెళ్లిపోతుంటారు. రానా అతడిని ఆపి తర్వాతవి కూడా చదివిస్తాడు. 

Prabhas-Allu Arjun

ఈసారి రానా చదువుతూ.. మా 'మా' ప్రెసిడెంట్ అని మొదలుపెడతాడు.. వెంటనే తేజ సజ్జా వద్దని చెబుతాడు. అవును లే..మళ్ళీ 48 గంటల్లోగా డిలీట్ చేయమని చెబుతాడు అంటూ మంచు విష్ణుపై సెటైర్లు వేశారు. బచ్చన్ గారు ఈ  ఏడాది హైయెస్ట్ హై.. లోయెస్ట్ లో కూడా చూశారు అని రానా అంటాడు.  హైయెస్ట్ హై కల్కి.. లోయెస్ట్ లో ఏంటి అని తేజ అడగగా.. అదే మిస్టర్... అని రానా అనబోతే తేజ వద్దు వద్దు అర్థం అయింది అని అంటాడు. మిస్టర్ బచ్చన్ పై సెటైర్ అది. రానా, తేజ ఫన్ కోసం అలా మాట్లాడినప్పటికీ.. ఆయా స్టార్ హీరోల ఫ్యాన్స్ కొందరు హర్ట్ అవుతున్నారు.  

Latest Videos

click me!