టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్ గర్భవతిగా ఉన్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై రానా ఫ్యామిలీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, ఆయన భార్య మిహీకా బజాజ్ త్వరలో తమ జీవితంలో కొత్త అధ్యాయానికి స్వాగతం పలకబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల మిహీకా షేర్ చేసిన ఓ ఫొటోలో ఆమె తన కడుపుపై చేయి ఉంచిన విధానం అభిమానుల్లో ఆసక్తిని రేపింది. ఆ ఫొటో వైరల్ అవ్వడంతో, రానా దంపతులు తమ తొలి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారనే వార్తలు వైరల్ గా మారాయి.
25
తండ్రి కాబోతున్న రానా
అయితే రానా, మిహీకా ఇంకా అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. త్వరలో రానా, మిహీక నుంచి అధికారిక ప్రకటన రావచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.‘లీడర్’, ‘బాహుబలి’, ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రానా, తన వ్యక్తిగత జీవితాన్ని సాధారణంగా పబ్లిక్ దృష్టికి దూరంగా ఉంచే వ్యక్తి. అయినా, ఈ తాజా వార్త ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
35
ఐదేళ్ల క్రితం పెళ్లి
మిహీకా బజాజ్ ఒక ప్రఖ్యాత వ్యాపారవేత్త, వెడ్డింగ్ ప్లానర్. రానా, మిహీకా ప్రేమకథ 2020లో కరోనా సమయంలో ప్రారంభమై, ఆగస్టు నెలలో జరిగిన వివాహంతో లైఫ్ టైం రిలేషన్ గా మారింది. ఆ సమయంలో వీరి పెళ్లి తక్కువ మందితో జరిగినా, దేశవ్యాప్తంగా ప్రధాన వార్తలుగా నిలిచింది. మొత్తంగా పెళ్ళైన 5 ఏళ్ళకి రానా తండ్రి కాబోతున్నాడు.
రానా నటుడిగానే కాకుండా నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా కూడా రానా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన నిర్మించిన ‘36 చిన్న కథ కాదు’ వంటి కాన్సెప్ట్ డ్రైవెన్ సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం రానా నిర్మిస్తున్న చిత్రం ‘కాంత’, ఇందులో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఓ తమిళ సూపర్‌స్టార్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కుతోందని సమాచారం.
55
చిత్ర పరిశ్రమకు చెందిన ఫ్యామిలీ
సినీ కుటుంబానికి చెందిన రానా తాత డాక్టర్ డి. రామానాయుడు, దక్షిణ భారత చిత్రసీమలో అత్యధిక సినిమాలు నిర్మించిన నిర్మాతగా రికార్డు సాధించారు. ఆయన స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ స్టూడియో ఇప్పటికీ భారతదేశంలో అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. రానా తండ్రి సురేష్ బాబు ప్రముఖ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగుతుండగా, ఆయన బాబాయ్ వెంకటేష్ దగ్గుబాటి ఇటీవల ‘సంక్రాంతికివస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని సాధించారు.