ఇండియన్ సినిమా చరిత్రలోనే మోస్ట్ ఐకానిక్ మూవీపై అల్లు అర్జున్ కామెంట్స్.. టాలీవుడ్ హీరో ఫ్యాన్స్ కి పిలుపు

Published : Oct 25, 2025, 08:37 PM IST

ఇండియన్ సినిమా చరిత్రలో ఐకానిక్ ఫిలిం గా నిలిచిన మూవీపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఇంతకీ బన్నీ స్వయంగా ప్రశంసించిన ఆ మూవీ ఏంటి ? ఎందుకు ఇప్పుడు ఆ సినిమా ప్రస్తావన వచ్చింది అనే వివరాలు ఈ కథనంలో చూద్దాం. 

PREV
15
శివ మూవీ రీరిలీజ్ 

తెలుగు సినిమా చరిత్రని, ఇండియన్ సినిమా గతిని మలుపు తిప్పిన క్లాసిక్ చిత్రాలలో శివ ఒకటి. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన ఈ మూవీ ఆయన కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం నవంబర్ 14న 4K క్వాలిటీలో, డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ శివ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

25
ఇండియన్ సినిమా చరిత్రలో ఐకానిక్ మూవీ 

అల్లు అర్జున్ మాట్లాడుతూ, “మన ‘శివ’ సినిమా విడుదలై దాదాపు 36 సంవత్సరాలు అవుతోంది. ఇది తెలుగు సినీ పరిశ్రమకే కాదు, భారతీయ సినీ చరిత్రలో కూడా ఒక ఐకానిక్ సినిమా. ఈ ఒక్క సినిమా తర్వాత తెలుగు, భారతీయ సినిమాల దిశ పూర్తిగా మారిపోయింది” అని తెలిపారు.దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజన్‌ను, హీరో అక్కినేని నాగార్జున నటనను ప్రశంసిస్తూ, “శివ సినిమాలోని ఎనర్జీ, రియలిజం, కథ చెప్పే విధానం తెలుగు సినిమా అప్రోచ్ ని శాశ్వతంగా మార్చేశాయి. శివ కేవలం సినిమా మాత్రమే కాదు ఒక అద్భుత ఘట్టం అని అల్లు అర్జున్ అన్నారు. 

35
నాగార్జున ఫ్యాన్స్ కి బన్నీ పిలుపు 

అల్లు అర్జున్ ఇంకా జోడిస్తూ, “ఇప్పుడు ఈ సినిమాను మళ్లీ అత్యాధునిక సాంకేతికతతో, 4K విజువల్స్‌తో, డాల్బీ ఆట్మాస్ సౌండ్‌లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇది మన క్లాసిక్‌కి సెలబ్రేషన్ సమయం. ఇది మనందరి సినిమానే, మన ప్రియమైన నాగార్జున గారికి చెందిన సినిమా. అక్కినేని అభిమానులు, తెలుగు సినిమా ప్రేమికులు రెండు లారీల పేపర్లతో థియేటర్లలో వేడుక జరుపండి” అని అన్నారు.

45
అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్ 

1989లో విడుదలైన ఈ చిత్రం రామ్ గోపాల్ వర్మకు దర్శకుడిగా తొలి చిత్రం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం కాలేజీ నేపథ్యంలో చోటుచేసుకున్న గ్యాంగ్ వార్ కథతో, అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగు సినిమాల మూస ధోరణికి ఈ చిత్రం అడ్డుకట్ట వేసింది. 

55
నాగార్జున రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ 

‘శివ’ సినిమా కథనం, సౌండ్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రియలిస్టిక్ యాక్షన్ సన్నివేశాలు అప్పట్లో కొత్త తరహా దిశను చూపించాయి. ఇళయరాజా అందించిన సంగీతం, నాగార్జున నటన ఈ సినిమాను మరింత శక్తివంతంగా నిలబెట్టాయి.సినీ ప్రేమికులు, అక్కినేని అభిమానులు, రామ్ గోపాల్ వర్మ అభిమానులు ఈ రీ రిలీజ్‌కి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 36 ఏళ్ల తర్వాత కూడా ‘శివ’ ప్రభావం తగ్గలేదు. ఈ రీ రిలీజ్ మరోసారి తెలుగు సినిమాకి ఆ గర్వకారణమైన ఘట్టాన్ని గుర్తు చేయనుంది.

Read more Photos on
click me!

Recommended Stories