ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 40 ఏళ్ల కెరీర్, నాలుగు భాషల్లో 300 వరకూ సినిమాలు, సెకండ్ ఇన్నింగ్స్ లో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సాధించిన హీరోయిన్ ఎవరో తెలుసా? స్టార్ డైరెక్టరుని పెళ్లాడిన ఆమె ప్రస్తుతం ఆమె ఏం చేస్తోంది.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా స్టార్ డమ్ తో కొనసాగుతున్న నటీమణులు చాలా తక్కువ మంది ఉన్నారు. తమదైన గుర్తింపుతో భారీ సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేస్తున్నారు. హీరోయిన్లు గా తెలుగు తెరను ఏలినవారిలో కొంత మంది మాత్రమే ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతూ.. స్టార్ డమ్ తో కంటీన్యూ అవుతున్నారు. వారిలో రమ్యకృష్ణ కూడా ఒకరు. సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న ఈ నటి.. హీరోయిన్ గా ఎంత స్టార్ డమ్ తెచ్చుకుందో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అంతే స్టార్ డమ్ తో కొనసాగుతోంది.
25
55 ఏళ్ల వయసులో కూడా
టాలీవుడ్ లో హీరోయిన్ గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది రమ్య కృష్ణ. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, జగపతి బాబు, వెంకటేష్, శ్రీకాంత్ లాంటి హీరోలతో నటించిన రమ్యకృష్ణ, తమిళంలో రజినీకాంత్, విజయ్ కాంత్, శరత్ కుమార్ లాంటి హీరోలతో ఆడిపాడింది. హిందీలో కూడా అమితాబ్, షారుఖ్ లాంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది రమ్య కృష్ణ. 40 ఏళ్ల కెరీర్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాలలో నటించి తన ప్రతిభను నిరూపించుకుంది సీనియర్ నటి. ఇప్పటికీ కీలక పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో తన ఇమేజ్ ను నిలబెట్టుకుంటోంది. హీరోయిన్‌గా భారీ స్టార్ డమ్ సంపాదించిన రమ్యకృష్ణ, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా అత్యంత ప్రభావం చూపుతోంది.
35
శివగామి పాత్రతో పెరిగిన పాపులారిటీ..
హీరోయిన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే తెలిసిన రమ్యకృష్ణ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను సాధించింది. పవర్ ఫుల్ శివగామిన పాత్రలో మెస్మరైజ్ చేసింది సీనియర్ తార. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంతో రమ్యకృష్ణ కెరీర్ మరోసారి మరో మలుపు తిరిగింది. హీరో, హీరోయిన్ పాత్రలకు పోటీగా నిలిచే స్థాయిలో ఆమె శివగామి పాత్ర ఆదరణ పొందింది. ఈ చిత్రానికి అనేక అవార్డులు కూడా లభించాయి. ఆతరువాత జైలర్ సినిమాలో రజనీకాంత్ భార్యగా నటించిన రమ్యకృష్ణ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా 650 కోట్లకుపైగా వసూళ్లు సాధించి భారీ విజయం అందుకుంది.
హీరోయిన్ గా సినిమాలు తగ్గిన వెంటనే డైరెక్టర్ కృష్ణ వంశీని పెళ్లాడింది రమ్యకృష్ణ. 2003 లో వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా భారీగా రెమ్యునరేషన్ వసూలు చేస్తోందట రమ్య కృష్ణ. సినిమాకు 3 కోట్ల వరకూ వసూలు చేస్తున్నట్టు టాక్. ఈ విషయంలో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. ఇక ఈ మధ్య కాలంలో రమ్యకృష్ణ ఆస్తులు, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరిశ్రమలో సుదీర్ఘకాలంగా పని చేసిన రమ్యకృష్ణ ఆర్థికంగా స్ట్రాంగ్ అయ్యారు. ఆమెకు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయని తెలుస్తోంది. అంతే కాదు కార్లంటే రమ్యకృష్ణకు ప్రత్యేకమైన ఇష్టం ఉండడంతో, ఆమె గ్యారేజ్‌లో అనేక రకాల లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం.
55
రమ్యకృష్ణ సినిమాలు..
నగలు విషయంలో రమ్యకృష్ణకు ప్రత్యేక అభిరుచి ఉంది. వివిధ సందర్భాల్లో గోల్డ్ ను ఎక్కువగా ధరించడానికి ఆమె ఇష్టపడుతుంది.ఇక రమ్యకృష్ణ ఆస్తుల విలువ దాదాపు 200 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని సమాచారం ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. బాహుబలి తరువాత రమ్యకృష్ణకు అవకాశాలు పెరిగిపోయాయి. 55 ఏళ్ల వయసులో హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రల్లో కనిపిస్తోంది మాజీ హీరోయిన్. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు తల్లిగా పలు సినిమాల్లో నటించింది రమ్యకృష్ణ.