బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి బాలయ్యతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు కానీ ఇంతవరకు చిరంజీవితో మూవీ చేయలేదు. అందుకు కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. బోయపాటి శ్రీను సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. లాజిక్ లని పక్కన పెట్టి ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ బోయపాటి సినిమాలు చూస్తారు.
25
చిరంజీవితో బోయపాటి సినిమా
ఇదిలా ఉండగా బోయపాటి తన కెరీర్ లో రవితేజ, వెంకటేష్, బాలకృష్ణ, అల్లు అర్జున్, ఎన్టీఆర్, బెల్లంకొండ శ్రీనివాస్, రామ్ పోతినేని లతో సినిమాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో ఇంతవరకు బోయపాటి మూవీ చేయలేదు. దానికి గల కారణాన్ని చెబుతూ ఓ ఇంటర్వ్యూలో బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారితో సినిమా చేయడానికి నాకు ఇంకా అవకాశం రాలేదు. ఒక వేల ఆఫర్ వచ్చినా కథపై వర్క్ చేయాలి. ఎందుకంటే చిరంజీవి గారికి సరిపడే కథ నా దగ్గర లేదు.
35
అఖండ సినిమానే కారణమా ?
అఖండ సక్సెస్ తర్వాత లెక్కలు అన్నీ మారిపోయాయి. చిరంజీవి గారితో సినిమా చేయాలి అంటే అఖండ రేంజ్ లో ఉండే కథే కావాలి. ఇంకా ఆ తరహా సబ్జెక్టు చిరంజీవి గారికి నేను రెడీ చేయలేదు. అఖండకి ముందు మాత్రం చిరంజీవి గారికి సరిపడే కథలు నా దగ్గర ఉండేవి. ఆ సమయంలో ఛాన్స్ రాలేదు. ఆ కథలతో ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా చేయలేదు. చేస్తే అఖండ స్థాయిలో ఉండే కథ మాత్రమే చేయాలి అని బోయపాటి అన్నారు.
నా దర్శకత్వంలో సినిమా అంటే బాలయ్య అసలు కథ వినరు. క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పు అది ఫాలో అవుతా అని అంటారు. బాలయ్యకి నాపై ఉన్న నమ్మకం అని బోయపాటి తెలిపారు. తన కథల జడ్జిమెంట్ విషయంలో ఇతరులని ఇన్వాల్వ్ కానివ్వను అని బోయపాటి తెలిపారు.
55
అల్లు అరవింద్ కి ఒక్క సీన్ కూడా చూపించలేదు
అల్లు అర్జున్ తో సరైనోడు సినిమా చేసేటప్పుడు కూడా అల్లు అరవింద్ గారికి కథ చెప్పలేదు. మధ్యలో రషెస్ కూడా చూపించలేదు ఫైనల్ ఎడిట్ పూర్తయ్యాక మాత్రమే చూపించా. ఎందుకంటే మధ్యలో ఒకటి రెండు సీన్లు చూసి కంప్లీట్ సినిమాని జడ్జ్ చేయలేము అని బోయపాటి అన్నారు. మరి భవిష్యత్తులో అయినా బోయాపాటి, చిరంజీవి కాంబినేషన్ లో మూవీ ఉంటుందేమో చూడాలి. అఖండ చిత్రం బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అఖండ 2 కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.