తొలిసారి స్పందించిన అభిషేక్..
ఎన్ని వార్తలు వచ్చినా బచ్చన్ ఫ్యామిలీ మాత్రం ఈ విషయంపై మౌనం పాటిస్తూ వచ్చింది. కానీ తొలిసారి అభిషేక్ బచ్చన్ ఈ విషయాలై స్పందించడం విశేషం. విడాకుల వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూవర్ అడిగిన ప్రశ్నకు అభిషేక్ సమాధానం ఇచ్చాడు. ‘ మీరు ఐశ్వర్యకు విడాకులు ఇస్తున్నారంటూ వస్తున్న వార్తలు మీ కూతురు ఆరాధ్యకు తెలుసా?’ అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ప్రశ్నించగా.. ‘ లేదు... ఇవేమీ నా కూతురికి తెలియదు’ అని ఆయన చెప్పారు.
అంతేకాదు.. అసలు తాను ఐశ్వర్యకు విడాకులు ఇవ్వడం లేదని.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేవలం పుకార్లు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వార్తల కారణంగా తన కూతురు చాలా బాధపడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘ నా కూతురు ఆరాధ్య ఇంకా చిన్న పిల్ల. తన దగ్గర కనీసం మొబైల్ కూడా లేదు. కానీ, ఇంట్లో ఎవరో ఒకరి ఫోన్ తీసుకొని గూగుల్ లో వార్తలు చూస్తే..? అలాంటి తప్పుడు వార్తలు ఆమె చదివితే ఆమె మనసులో ఎలాంటి సందేహాలు వస్తాయి? ఒక చిన్న పిల్ల మైండ్ ఎంత ప్రభావితం అవుతుందో ఎవరికీ అర్థం కాదు.’ అంటూ అభిషేక్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.
‘నాకు చిన్నప్పటి నుంచే మీడియా దేశపు మనస్సాక్షి అనే నేర్పించారు. కానీ, ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.. మీరు మాట్లాడేది మరో మనిషి గురించి అని. ఒకరి కొడుకు, తండ్రి, భర్త, భార్య గురించి అని తెలుసుకోవాలి. అందుకే.. కచ్చితంగా బాధ్యతగా ఉండాలి. నా గురించి మాట్లాడండి. కానీ నా కుటుంబం గురించి అబద్ధాలు, సృష్టించిన కథలు, అసత్యాలు మాట్లాడితే మాత్రం సహించను. నేను ప్రతి విషయాన్ని అందరికీ వెళ్లి వివరణ ఇవ్వలేను. నాకు ఎప్పుడు ఏం చెప్పాలి అనిపిస్తే అప్పుడే చెబుతాను. నేను ఎప్పుడూ తప్పు పని చేయలేదు. కాబట్టి వెంటనే వివరణలు ఇవ్వాల్సిన అవసరం నాకు కనిపించదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. ఎవరైనా నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను’ అని అభిషేక్ క్లారిటీ ఇచ్చారు.