సౌందర్య కెరీర్ లో మెమొరబుల్ మూవీస్ లో అంతఃపురం ఒకటి. 1998లో ఈ చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీలో జగపతి బాబు, సౌందర్య, ప్రకాష్ రాజ్ పోటీ పడి నటించారు. ఈ చిత్రం గురించి ఓ ఇంటర్వ్యూలో కృష్ణ వంశీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ వల్ల మీకు, రమ్యకృష్ణకి గొడవ జరిగిందట నిజమేనా అని యాంకర్ ప్రశ్నించారు.