డైరెక్టర్ చేసిన ఆ ఒక్క పనితో 90 కోట్ల ఆస్తులు పోగేసుకున్న రమ్యకృష్ణ.. ఆమె జీవితాన్ని మార్చేసింది అదే.. 

First Published | Nov 17, 2024, 1:24 PM IST

సిల్వర్ స్క్రీన్ పై అందంగా కనిపించాలన్నా, పొగరుబోతు అమ్మాయిగా నటించాలన్నా, భావోద్వేగమైన సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టించాలన్నా రమ్యకృష్ణకి రమ్యకృష్ణనే సాటి.

సిల్వర్ స్క్రీన్ పై అందంగా కనిపించాలన్నా, పొగరుబోతు అమ్మాయిగా నటించాలన్నా, భావోద్వేగమైన సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టించాలన్నా రమ్యకృష్ణకి రమ్యకృష్ణనే సాటి. ఇప్పటికీ రమ్యకృష్ణ తనకి వస్తున్న పాత్రలలో అద్భుతంగా నటిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు 35 ఏళ్ళ పైగా తన కెరీర్ ని రమ్యకృష్ణ విజయవంతంగా సాగిస్తోంది. 

రమ్యకృష్ణ తన కెరీర్ లో వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ లాంటి అగ్ర హీరోలతో నటించి మెప్పించింది. అయితే రమ్యకృష్ణకి ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే స్టార్ స్టేటస్ రాలేదు. దాదాపు 15 పైగా చిత్రాల్లో నటించిన తర్వాతే ఆమెకి మంచి గుర్తింపు మొదలయింది. రమ్యకృష్ణ అందంలో, నటనలో, ట్యాలెంట్ లో ఆమెకి తిరుగులేదు. కానీ ఆమె స్టార్ హీరోయిన్ కాకపోవడానికి కారణాలని రాఘవేంద్ర రావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 


రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ఒక హీరోయిన్ కి మంచి గుర్తింపు రావాలంటే అందంగా ఉంటే సరిపోదు.. ట్యాలెంట్ ఉంటే సరిపోదు.. అందం, ట్యాలెంట్ రెండూ ఉన్నా మంచి హీరోయిన్ అవుతుందని చెప్పలేం. కానీ అందం ట్యాలెంట్ రెండూ ఉన్న హీరోయిన్ కి ఆమె మంచి సినిమా, అందులో మంచి సన్నివేశాలు పడాలి.. ఆ మూవీ హిట్ కావాలి. అప్పుడే హీరోయిన్ కి గుర్తింపు వస్తుంది అని రాఘవేంద్ర రావు అన్నారు. 

రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్ కావడంలో డైరెక్టర్ రాఘవేంద్ర రావు పాత్ర చాలా కీలకం. ఒకరకంగా ఆమెని స్టార్ హీరోయిన్ చేసింది రాఘవేంద్ర రావు మాత్రమే అని చెప్పొచ్చు. దాదాపు 15 చిత్రాల వరకు రమ్యకృష్ణకి ఎలాంటి గుర్తింపు లేదు. 1990లో రమ్యకృష్ణ.. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అల్లుడు గారు చిత్రంలో నటించింది. ఆ మూవీలో రమ్యకృష్ణ నటించింది కొన్ని సీన్లు, ఒక పాటలో మాత్రమే. కానీ రాఘవేంద్ర రావు ఒక్క పాటతో ఆమె జాతకాన్ని మార్చేశారు. ఆ మూవీలో రమ్యకృష్ణ మూగ అమ్మాయిగా నటించింది. 

'ముద్దబంతి పువ్వులో ముగ బాసలు' అనే పాటలో రమ్యకృష్ణ ట్యాలెంట్ అందరికీ తెలిసేలా చిత్రీకరించారు రాఘవేంద్ర రావు. రమ్యకృష్ణ అందంగా కనిపిస్తూ ముగ అమ్మాయిగా ఆ సాంగ్ మల్టిపుల్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. చిరునవ్వుతో మాయ చేస్తూనే ఎమోషనల్ గా కూడా హావ భావాలు పలికించింది అని రాఘవేంద్ర రావు తెలిపారు. ఆ ఒక్క సాంగ్ తో రమ్యకృష్ణకి అద్భుతమైన అవకాశాలు ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత మరోసారి రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అల్లరి ప్రియుడు చిత్రంలో నటించింది. ఆ మూవీ సెన్సేషనల్ హిట్ కావడంతో రమ్యకృష్ణ టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరిగా మారారు. 

రమ్యకృష్ణ తన 35 ఏళ్ళ కెరీర్ లో 90 కోట్ల వరకు ఆస్తులు సంపాదించారు. రమ్యకృష్ణ ఈ స్థాయిలో స్టార్ హీరోయిన్ కావడానికి, భారీ రెమ్యునరేషన్ తో ఆస్తులు సంపాదించడానికి బీజం వేసింది మాత్రం అల్లుడుగారు చిత్రం. రమ్యకృష్ణ కెరీర్ లో రాఘవేంద్ర రావుకి ఎక్కువ క్రెడిట్ ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. 

Latest Videos

click me!