రమ్యకృష్ణ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా? నిజాలు బయటపెట్టిన కృష్ణవంశీ.. శివగామిలో తెలియని యాంగిల్‌

First Published | Oct 18, 2024, 7:30 PM IST

రమ్యకృష్ణ అంటే ఓ రెబల్‌ ఇమేజ్‌ ఉంది. కానీ ఇంట్లో ఆమె ఎలా ఉంటుందో మాత్రం ఫస్ట్ టైమ్‌ బయటపెట్టాడు దర్శకుడు కృష్ణవంశీ. ఎవరికీ తెలియని రహస్యాలను వెల్లడించారు. 
 

రమ్యకృష్ణ అంటే ఒకప్పుడు గ్లామర్‌ హీరోయిన్‌గా పేరుండేది. కానీ `నరసింహ` లాంటి సినిమా తర్వాత నటిగా ఆమేంటో చూపించింది. ఇక `బాహుబలి` తర్వాత తన రేంజ్‌ మారిపోయింది. శివగామిగా ఆమె విశ్వరూపం చూసి రాజమౌళి సైతం షాక్‌ అయ్యారు. రమ్యకృష్ణ ఇమేజ్‌ని మార్చేసి మూవీ ఇది.

శివగామిగా ఆమె చేసిన రచ్చ మామూలు కాదు. ఆ పాత్రకి ఆమె తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరనేంతగా, శివగామి అనే పేరుతోనే ఆమెని పిలిచేంతగా రమ్యకృష్ణ ఆ పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పటికీ బలమైన పాత్రలతో అలరిస్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు శివగామి పాత్రని మరిపించే రోల్‌ ఇంక పడలేదు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఇదిలా ఉంటే నటి రమ్యకృష్ణ, దర్శకుడు కృష్ణవంశీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాగార్జున హీరోగా నటించిన `చంద్రలేఖ` సినిమా షూటింగ్‌ టైమ్‌లో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇన్నాళ్లు వీరి వైవాహిక జీవితం అంతా బాగానే సాగుతుంది. కానీ ఇటీవలే కొన్ని రూమర్స్ వీరిని చుట్టుముట్టాయి. వీరి మ్యారేజ్‌ లైఫ్‌ని ప్రశ్నించే రూమర్స్ బయటకు వచ్చాయి. ఈ ఇద్దరు దూరంగా ఉంటున్నారని, విడిపోతున్నారనే కామెంట్స్ వచ్చాయి. రమ్యకృష్ణ చెన్నైలో, కృష్ణవంశీ హైదరాబాద్‌లో ఉంటున్నారనే ప్రచారం స్టార్ట్ అయ్యింది. ఇది వీరిద్దరు విడాకుల రూమర్‌కి కారణం అయ్యిందని తెలుస్తుంది. 
 


దీనిపై కృష్ణవంశీ మాట్లాడారు. సినిమాల షూటింగ్‌ల కోసం తాను హైదరాబాద్‌లో ఉంటున్నానని, రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుందన్నారు. తాము దూరంగా ఉండటం వల్లే ఈ రూమర్స్ క్రియేట్‌ అయి ఉంటాయని తెలిపారు. ఇలా రూమర్లని వ్యాప్తి చేయడం శాడిజం అని, వీటిని చూస్తుంటే నవ్వొస్తుందని, ఇందులో ఏమాత్రం నిజం లేదన్నారు కృష్ణవంశీ. అయితే తమపై అభిమానంతోనే ఇలా గాసిప్‌ క్రియేట్‌ చేస్తున్నారని, అయ్యో కృష్ణవంశీ, రమ్యకృష్ణ దూరంగా ఉంటున్నారని బాధపడి ఇలా చేసి ఉంటారని తనదైన స్టయిల్‌లో సెటైర్లు వేశాడు కృష్ణవంశీ. తామిద్దరం కలిసి ఇటీవల ఏ ఫంక్షన్‌లో కనిపించడం లేదని, దీని వల్ల కూడా ఈ రూమర్లు పుట్టి ఉంటాయని, అయితే తాము ప్రైవేట్‌ ఈవెంట్లు, ఫ్యామిలీ ఫంక్షన్లకి కలిసే వెళ్తున్నామని, కానీ ఆయా ఫోటోలు బయటకు పంచుకోవడం ఇష్టం లేదన్నారు కృష్ణవంశీ. తామేంటో తమకు తెలుసు అని, ఇంటికెళ్లాక మా ప్రపంచం వేరని చెప్పారు దర్శకుడు.
 

ఈ సందర్భంగా రమ్యకృష్ణ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు దర్శకుడు. ఇంట్లో శివగామి ఎలా ఉంటుందో తెలిపారు. రమ్య చాలా ఫన్నీ పర్సన్‌ అని, మనుషులను బాగా ప్రేమిస్తుందని, ఎంతో బాగా చూసుకుంటుందన్నారు. ఇంట్లో ఎంతో జోవియల్‌గా ఉంటుందని, అదే సమయంలో తాను చాలా తెలివైనదని, అన్ని విషయాల్లో చాలా స్మార్ట్ గా, షార్ప్ గా ఉంటుందని చెప్పారు. తన ఫ్యామిలీని రమ్యకృష్ణ చాలా బాగా చూసుకుంటుందని వెల్లడించారు కృష్ణవంశీ. ఇలా భార్యని ప్రశంసలతో ముంచెత్తడం విశేషంగా చెప్పొచ్చు. విడాకుల రూమర్లకి ఇలా సింపుల్‌గా చెక్‌ పెట్టారు క్రియేటివ్‌ డైరెక్టర్‌. 

ఇటీవల `ఖడ్గం` సినిమా రీ రిలీజ్‌ టైమ్‌లో ఈ విషయాలను వెల్లడించారు దర్శకుడు. కృష్ణవంశీ చివరగా `రంగమార్తాండ` సినిమాని తెరకెక్కించారు. ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, శివాత్మిక, రాహుల్‌ సిప్లిగంజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ విమర్శలకు ప్రశంసలందుకుంది. కానీ కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయింది. రమ్యకృష్ణ ఇటీవల `గుంటూరు కారం`, `పురుషోత్తముడు` చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి అలరించింది. 
read more: నాగచైతన్యకి కాబోయే భార్య శోభితా కలలు కన్న జాబ్‌ ఏంటో తెలుసా? రాష్ట్రపతి వద్ద అంటూ ఏవేవో ఊహించుకుంది కానీ!

Latest Videos

click me!