కుక్క విషయంలో నాగార్జున ‌- అమల మధ్య గొడవ, మ్యాటర్ ఎంత దూరం వెళ్లిందంటే..?

First Published | Oct 18, 2024, 6:37 PM IST

సినిమా సెలబ్రిటీల మధ్య  కూడా ఏదో ఒక ఇష్య్యూస్ తప్పవు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న హీరో హీరోయిన్ల మద్య ఎంత ప్రేమ ఉంటుందో అన్నిగిల్లి కజ్జాలు కూడా కామన్. ఈక్రమంలోనే టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, ఆయన భార్య అమల మధ్య కూడా లాంటి గొడవ ఒకటి జరిగిందట. అది కూడా కుక్క వల్ల. ఇంతకీ ఏంటా గొడవ. 

హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు టాలీవుడ్ మన్మదుడు నాగార్జున. అంతకు ముందు హీరో వెంకటేష్ చెల్లెలు లక్ష్మితో వివాహం అవ్వగా.. వారికి నాగచైతన్య పుట్టాడు. అయితే ఇద్దరు ఒప్పందం ప్రకారం విడాకులు తీసుకోగా.. లక్ష్మి ఓ బిజినెస్ మెన్ ను పెళ్ళాడి అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇక నాగార్జున సినిమాలు చేస్తూ.. అమలనుప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 

Also Read:మహేష్ బాబు మావయ్యా.. అని ప్రేమగా పిలుచుకునే స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

ఇక వీరికి అఖిల్ జన్మించారు. ఇక పెళ్ళి తరువాత నాగార్జున , అమల ఇప్పటి వరకూ ఎటువంటి గోడవ లేకుండా ఆదర్శ దంపతుల్లా జీవిస్తున్నారు. అమల పెళ్ళి తరువాత సినిమాలు మానేసి..కుటుంబాన్ని చూసుకున్నారు. రెడ్ క్రాస్ సొసైటీలో మెంబర్ గా కూడా ఉన్నారు. అయితే అఖిల్ పెద్దవాడు అయిన తరువాత అమల అప్పుడప్పుడు తల్లి పాత్రల్లో మెరుస్తూ వస్తున్నారు. 

Also Read:మోక్షజ్ఞ కు తల్లి పాత్రలో బాలకృష్ణ హీరోయిన్,


ఈమధ్య కాలంల్ కూడా ఆమె కొన్నిసినిమాల్లో నటించారు. ఇక అమల కాని నాగార్జున కాని తన ఫ్యామిలీ విషయాలు వెల్లడించడం చాలా అరుదు అటువంటిది  ఆమధ్య అమల నాగార్జునకు తనకు జరిగిని ఓ గొడవ విషయాన్ని వెల్లడించారు. అది కూడా ఓ కుక్కు విషయంలో జరిగిందట ఆ వివాదం. అసలు సంగతేంటంటే.. 

Also Read:100 కోట్ల హీరో జూనియర్ ఎన్టీఆర్.. 7 కోట్లు మాత్రమే తీసుకుని చేసిన సినిమా..? కారణం ఏంటో తెలుసా..?

అమల రెడ్ క్రాస్ మెంబర్. కుక్కలను ఇతర జీవులను హింసిస్తే ఒప్పుకోరు. ఇక వారి ఇంట్లో కూడా ఎన్నో రకాల కుక్కలు ఉన్నాయట. అయితే అవన్నీ ఇండియన్ డాగ్స్ కాగా.. ఓ సందర్భంటో ఓ ఫారెన్ డాగ్ ను తీసుకువచ్చారట. అది చాలా పెద్దగా ఉంటుంది. అయితే ఇంట్లో వారిపై ..ఇంటికి వచ్చిన గెస్ట్ లపై కూడా రెండు కాళ్ళు ఎత్తి నించోవడం.. భయపెట్టడం లాంటవవి చేస్తుందట. 

దాంతో అమల కొన్ని రోజులు చూసి.. ఆ కుక్కను నెల రోజలు ట్రైయినింగ్ కోసం పంపించిందట. అయితే అప్పటికే నాగార్జునకు ఆ కుక్క అంటే ఎఫెక్షన్ పెరిగిపోయిందట. దాంతో ఆ డాగ్ ను ఎందుకు పంపించేశావు.. అని అమల మీద అలిగారట. ఆ డాగ్ నాగార్జున షూటింగ్ నుంచి రాగానే వెల్కం చెపుతూ.. మీదకు వచ్చేదట. ఎంతో ప్రేమగా దగ్గరకు వచ్చదట. 

Also Read:నయనతార ముందు చిన్నబోయిన త్రిష

నాగ్ అంటే ఆ డాగ్ కు అంత ఇష్టం అంట. దాంతో దాన్ని పంపించేశావ్ అంటూ అమలతో మాట్లాడటం మానేశారట. అయితే ఆ కుక్కకు ట్రైయినింగ్ ఇవ్వడానికే కదా పంపించింది. అని చెప్పినా వినలేదట. అలా వారం రోజులు చూవారట అమల. ఇక తప్పక వారం తరువాత ఆకుక్కను తీసుకువచ్చారట. 

Also Read: ధనుష్, ఐశ్వర్య విడాకులు రద్దు?

అయితే ఆ వారానికే చాలా వరకు ట్రైయినింగ్ అయ్యిందట డాగ్. ఆతరువాత దాన్ని చూసి..నువ్వు మంచి పని చేశావ్ అని అప్పుడు అన్నారట నాగార్జున. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అమల వెల్లడించారు. 

Also Read:బిగ్ బాస్అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి

Latest Videos

click me!