Ramya Krishnan: కృష్ణవంశీకి భార్యగా కాదు, నాకు ఇలా ఉండటమే ఇష్టం.. రమ్యకృష్ణ బోల్డ్ స్టేట్‌మెంట్‌

Published : Jan 31, 2026, 08:02 AM IST

నటి రమ్యకృష్ణ బోల్డ్ అండ్‌ బ్యూటీఫుల్‌. ఆమె ఏదైనా ఓపెన్‌గా చెబుతుంది. ఇప్పుడు తన భర్త దర్శకుడు కృష్ణవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయనకు భార్యగా కంటే నటిగా ఉండటమే ఇష్టమని చెప్పింది. 

PREV
15
అవమానాల నుంచి స్టార్‌గా ఎదిగిన రమ్యకృష్ణ

రమ్యకృష్ణ కెరీర్ ప్రారంభంలో ఎన్నో స్ట్రగుల్స్ పడి హీరోయిన్‌గా ఎదిగింది. వరుస ఫ్లాపుల కారణంగా సినిమా అవకాశాలు కోల్పోయింది. అలాంటి దశలో రాఘవేంద్రరావు లైఫ్‌ ఇచ్చాడు. ఒక `అల్లుడుగారు`, `అల్లరి మొగుడు` చిత్రాలతో ఆమె కెరీర్‌ని మార్చేశాడు. స్టార్‌హీరోయిన్‌ ని చేశాడు. ఆ తర్వాత వరుసగా కమర్షియల్‌ సినిమాలతో రాణిస్తున్న ఆమెకి `నరసింహ` మూవీ మరో బ్రేక్‌ అని చెప్పొచ్చు. కెరీర్‌ని మరో మలుపు తిప్పింది. ఇక క్యారెక్టర్స్ వైపు టర్న్ తిరిగి అనేక సినిమాలు చేస్తున్న క్రమంలో `బాహుబలి` మూవీ మరో బ్రేక్‌ ఇచ్చింది. ఇలా తనని తాను నిరూపించుకుంటూ విలక్షణ నటిగా రాణిస్తుంది రమ్యకృష్ణ.

25
కృష్ణవంశీతో ప్రేమ, పెళ్లి

రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెళ్లిచేసుకుంది. కృష్ణవంశీ రూపొందించిన `చంద్రలేఖ` సినిమా సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దాదాపు ఐదేళ్లు ప్రేమించుకుని 2003లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే పెళ్లి తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి పనిచేసింది లేదు. మళ్లీ మూడేళ్ల క్రితం `రంగమార్తాండ` చిత్రానికి పనిచేశారు. ఇందులో ప్రకాష్‌ రాజ్‌కి భార్యగా రమ్యకృష్ణ నటించింది. ఆమె పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇది మూడేళ్ల క్రితం విడుదలైంది. విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ సక్సెస్‌ కాలేకపోయింది.

35
రమ్యకృష్ణ, కృష్ణవంశీ మధ్య గ్యాప్‌పై క్లారిటీ

రమ్యకృష్ణ, కృష్ణవంశీ దూరంగా ఉంటున్నారనే వార్తలు ఆ మధ్య వినిపించిన విషయం తెలిసిందే. రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుండగా, కృష్ణవంశీ హైదరాబాద్‌లో ఉంటున్నారు. అయితే తాము దూరంగా ఉంటున్నామనే దాంట్లో నిజం లేదని, వర్క్ రీత్యా అక్కడ ఉండాల్సి వస్తుందని, తాము కలిసే ఉన్నామని కృష్ణవంశీ తెలిపారు. తమ మధ్య ఎలాంటి దూరం లేదని స్పష్టం చేశారు.

45
కృష్ణవంశీ గురించి రమ్యకృష్ణ బోల్డ్ స్టేట్‌మెంట్‌

ఈ క్రమంలో తాజాగా రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ షాకిస్తున్నాయి. రమ్యకృష్ణ ఏదైనా బోల్డ్ గానే చెబుతుంది. ఏదీ లోపల దాచుకోదు. ఓపెన్‌గా చెప్పేస్తుంది. తాజాగా కృష్ణవంశీ గురించి ఆశ్చర్యకరమైన కామెంట్‌చేసింది. కృష్ణవంశీకి భార్యగా కంటే నటిగా ఉండటమే తనకు ఎక్కువ ఇష్టమని చెప్పింది. `చంద్రలేఖ` సినిమా తర్వాత కృష్ణవంశీ మళ్లీ నాతో పనిచేయకూడదని అనుకున్నారు. నేను సెట్‌లో ఎక్కువగా సరదాగా ఉంటాను, అందుకే నాకు డిసిప్లిన్‌ లేదని అనుకున్నాడు. అయినా సరే నాకు మాత్రం ఆయనతో పనిచేయడం ఇష్టం. ఆయన దర్శకత్వం అద్భుతం` అని తెలిపింది రమ్యకృష్ణ.

55
భర్తగా కంటే దర్శకుడిగానే ఇష్టం

ఈ సందర్భంగా ఒక క్రేజీ స్టేట్‌మెంట్‌ని ఇచ్చింది. కృష్ణవంశీకి భార్యగా గుర్తింపు కంటే నటిగానే ఉండటం నాకు ఎక్కువ ఇష్టం. ఇది ఒక నటిగా తన గుర్తింపుని తానే నిర్మించుకోవాలన్న ఆత్మవిశ్వాసంని చూపిస్తుంది. నాకు వంశీ భర్తగా కంటే దర్శకుడిగానే ఎక్కువగా ఇష్టం` అని రమ్యకృష్ణ తెలిపింది. `రంగమార్తాండ` సినిమా సమయంలో డయల్‌ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రమ్యకృష్ణ చివరగా `గుంటూరుకారం`, `పురుషోత్తముడు` చిత్రాల్లో మెరిసింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories