Ramya Krishnan: ఒక్క సర్జరీ కూడా లేదు.. 55 ఏళ్లలోనూ రమ్యకృష్ణ అందం చూస్తే మతిపోవాల్సిందే

Published : Feb 28, 2026, 05:35 PM IST

Ramya Krishnan: రమ్యకృష్ణ టాలీవుడ్‌లో ఎలాంటి సర్జరీ లేకుండా ఇప్పటికీ తరగని అందంతో రాణిస్తోన్న హీరోయిన్‌. మరి 55ఏళ్ల ఏజ్‌లోనూ రమ్యకృష్ణ ఇంత ఫిట్‌గా ఉండటం వెనుక కారణం ఏంటో తెలుసా?

PREV
15
55 ఏళ్లలోనూ రమ్యకృష్ణ అదే గ్రేస్!

`బాహుబలి`లో రాజమాత శివగామిగా రమ్యకృష్ణ అందరికీ గుర్తుండిపోయారు. 55 ఏళ్ల వయసులోనూ తన స్టైల్, అందంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టే ప్రతీ ఫొటో వైరల్ అవుతుంది. ట్రెడిషనల్ అయినా, స్టైలిష్ లుక్ అయినా.. ఏ డ్రెస్‌లోనైనా రమ్యకృష్ణ అదరగొట్టేస్తారు.  55 ఏళ్ల వయసులోనూ ఆమె అందం చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. ఆమె కళ్లు అయస్కాంతంలా ఆకట్టుకుంటాయి.

25
సర్జరీలు లేని సహజ సౌందర్యం రమ్యకృష్ణ సొంతం

రమ్యకృష్ణ ఇప్పటివరకు ఎలాంటి బ్యూటీ సర్జరీ చేయించుకోలేదని చెబుతారు. తన సహజ సౌందర్యంతోనే ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆ తరం నటీమణుల్లో ఆమె ఒకరు. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను షేర్ చేస్తూ 'నేచురల్ బ్యూటీ' అని అభిమానులు కామెంట్స్ పెడుతుంటారు.

35
కృష్ణవంశీతో రమ్యకృష్ణ వివాహం

ఎప్పటికీ యంగ్‌గా కనిపించే రమ్యకృష్ణ, 2003లో దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ పెళ్లి. వీరికి రిత్విక్ వంశీ అనే కుమారుడు ఉన్నాడు. చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసిన రమ్యకృష్ణ, ఇప్పటికీ స్టార్ యాక్టర్‌గా కొనసాగుతున్నారు.

45
200కు పైగా చిత్రాల్లో నటన

రమ్యకృష్ణ ఇప్పటివరకు 200కు పైగా చిత్రాల్లో నటించారు. సౌత్ ఇండియాలో బలమైన నటీమణుల జాబితాలో ఆమె పేరు ముందుంటుంది. తన 38 ఏళ్ల సినీ కెరీర్‌లో తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో 200కు పైగా సినిమాల్లో  కనిపించారు.

55
రమ్యకృష్ణ కెరీర్‌లో కొన్ని హిట్స్

బాహుబలి, నరసింహ, సూపర్ డీలక్స్, పంచతంత్రం, అమ్మన్, మేజర్ చంద్రకాంత్, అల్లరి మొగుడు, హలో బ్రదర్, ఖళ్ నాయక్, క్రిమినల్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో రమ్యకృష్ణ నటించారు. ప్రస్తుతం ఆమె చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నారు. బలమైన పాత్రలున్న సినిమాలే చేస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories