Alekhya chitti pickles: ఇదేం ట్విస్ట్ మామా.. సినిమాల్లోకి ప‌చ్చ‌ళ్ల‌మ్మాయి.?

Published : May 16, 2025, 07:22 PM IST

ఆలేఖ్య చిట్టి పికిల్స్.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారికి ఈ పేరును ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు చేసిన హ‌డావుడి అంద‌రికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ పేరు మరోసారి వార్త‌ల్లోకి ఎక్కింది.   

PREV
15
Alekhya chitti pickles: ఇదేం ట్విస్ట్ మామా.. సినిమాల్లోకి ప‌చ్చ‌ళ్ల‌మ్మాయి.?
Alekhya chitti pickles

ఓ కస్టమర్‌తో ఆలేఖ్య సిస్ట‌ర్స్ మాట్లాడిన మాట‌లు నెట్టింట పెద్ద ర‌చ్చకు తెర తీశాయి. దెబ్బ‌కు ప‌చ్చ‌ళ్ల వ్యాపారం ఆగిపోయింది. అయితే పచ్చళ్ల వ్యాపారం ఆగిపోయినా, వారి ఫాలోయింగ్ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో వీరి డైలాగ్స్‌ వైరల్ కావడంతో, వాటిపై మీమ్స్, ట్రోల్స్‌ భారీగా చక్కర్లు కొడుతున్నాయి.

25
Alekhya chitti pickles

ఇలాంటి సమయంలో, అలేఖ్య సిస్టర్స్‌లో రమ్య అనే యువతి ఒక సినీ ఈవెంట్‌లో హాజరవడం హాట్‌ టాపిక్‌గా మారింది. హీరో అశ్విన్ బాబు నటించిన "వచ్చినవాడు గౌతమ్" అనే తాజా చిత్ర టీజర్ విడుదల వేడుకలో రమ్య పాల్గొంది. ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ పక్కన రమ్య కనిపించగా, ఆమె ఈ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. 

35
Alekhya chitti pickles

ఈ సందర్భంగా నెటిజన్లలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. “పచ్చళ్లతో పాపులర్ అయిన రమ్య.. ఇప్పుడేంటి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేసిందా?”, “ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయిపోయిందా?” అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి అలేఖ్య చిట్టి సిస్టర్స్ ట్రెండింగ్‌లోకి వచ్చారు.

45
Alekhya chitti pickles

అయితే రమ్య ఈ సినిమాలో నిజంగా నటించిందా? లేదంటే ఈవెంట్‌కి మాత్రమే హాజరయ్యిందా? అనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఆమె నుంచి అధికారిక సమాధానం రాలేదు కాబట్టి అనుమానాలు వ్వ‌క్త‌మ‌వుతున్నాయి. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. 

55
Alekhya chitti pickles

ఇదిలా ఉంటే మరోవైపు, రమ్య బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశాలపై గతంలోనూ చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఆమె వేసే మోడ్రన్ డ్రెస్సింగ్, రీల్స్‌ చాలా వైరల్ అవుతూ ఉండటంతో, ఈ క్రేజ్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు దృష్టిలో పెట్టుకుని అవకాశం ఇవ్వనున్నారని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. 

Read more Photos on
click me!