Ramu Rathod: యూట్యూబ్ ను ఊపు ఊపేసిన రాము రాథోడ్ టాప్ 3 ఫోక్ సాంగ్స్.. 100 కోట్ల వ్యూస్ కు దగ్గరగా ఉన్న పాట ఇదే..

Published : Nov 03, 2026, 07:24 AM IST

Ramu Rathod: ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఫోక్ సింగర్ కమ్ డ్యాన్సర్ రాము రాథోడ్. ఆ క్రేజ్ తో గతంలో తాను చేసిన పాటలకు కూడా మంచి ఊపొచ్చింది. కోట్లలో వ్యూస్ సాధిస్తోన్న రాము రాథోడ్ టాప్ 3 ఫోక్ సాంగ్స్ ఏంటంటే?

PREV
13
రాము రాథోడ్ టాప్ 3 సాంగ్స్

తెలంగాణ జానపద సంగీతానికి తన మార్క్ వాయిస్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు రాము రాథోడ్. తెలంగాణ పల్లెపాటలను ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూ యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్ సాధిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన పాడిన మూడు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 'రాను బొంబాయికి రాను', 'సొమ్మసిల్లి పోతున్నవే చిన్నీ రాములమ్మ', 'తిప్పుకుంటున్నావ్' రింగు రింగుల జుట్టుదాన లాంటి పాటలు ఆయన కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టాయి. అంతే కాదు ఈ క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు లో కూడా సందడి చేశాడు రాము రాథోడ్. ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయాడు. మరి రాము రాథోడ్ కెరీర్ లో టాప్ 3 సాంగ్స్ ఏంటో చూస్తే?

రాను బొంబాయికి రాను

94.85 కోట్లు

948 మిలియన్ వ్యూస్

రాము రాథోడ్‌కు భారీ గుర్తింపు తీసుకొచ్చిన పాట ఇది. స్వయంగా సాహిత్యం రాసి ఆలపించిన ఈ పాటకు కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. లిఖిత నటన, గ్లామర్ తో పాటు ఆకట్టుకునే స్టెప్పులు, తెలంగాణ జానపద బాణీ ఈ పాట విజయానికి ప్రధాన కారణాలు. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ రూపంలోనూ ఈ పాట విపరీతంగా వైరల్ అయింది. అంతే కాదు రాము రాథోడ్ కు ఈ పాట ద్వారా కోటికి పైగా లాభం వచ్చిందని టాక్ ఉంది.

23
సొమ్మసిల్లి పోతున్నవే చిన్నీ రాములమ్మ

32 కోట్ల 90 లక్షలకు పైగా వ్యూస్

సుమారు 329 మిలియన్ వ్యూస్

ఈ పాటలో ప్రేమ, విరహం, ఎమోషన్స్ ను రాము రాథోడ్ తన గాత్రంతో అద్భుతంగా పలికించారు. పాటకు సాహిత్యం రాము రాథోడ్ అందించగా, సంగీతం బొల్లం కళ్యాణ్ సమకూర్చారు. విడుదలైన తర్వాత యువతలో మంచి ఆదరణ పొందింది. ఈ పాటకు లిరికల్ వెర్షన్ కూడా ప్రత్యేకంగా వ్యూస్ సాధించింది.

33
రింగు రింగుల జుట్టుదాన

11 కోట్ల 20 లక్షలకుపైగా వ్యూస్ సాధించిన పాట..

112 మిలియన్ వ్యూస్

తెలంగాణ ఫోక్ సింగర్ రాము రాథోడ్ పాడిన మరో సూపర్ హిట్ జానపద గీతం 'రింగు రింగుల జుట్టుదాన' యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఈ పాట 11 కోట్ల 20 లక్షలకుపైగా వ్యూస్ సాధించగా, ప్రస్తుతం మరింత ఆదరణ పొందుతోంది. ఈ పాటను రాము రాథోడ్, సింగర్ ప్రభ ఆలపించారు. ఈ పాటలో రాము రాథోడ్‌తో పాటు లిఖిత చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పల్లెటూరి ప్రేమికుల మధ్య సరదా సంభాషణలు, తెలంగాణ యాసలోని మధురమైన పదాలు పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

రాము రాథోడ్ రెమ్యునరేషన్ ఎంత?

రాము రాథోడ్ సంపాదన గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 'రాను బొంబాయికి రాను' పాట ఆయన ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసిందని చెప్పవచ్చు. ఈ పాటను రూపొందించడానికి సుమారు రూ.5 లక్షలు ఖర్చు చేసినట్లు రాము రాథోడ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

రెండు రోజుల షూటింగ్‌కు రూ.3.5 లక్షలు, పాట రాయడం, పాడించడం తదితర పనులకు రూ.1.5 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ పాట ద్వారా రూ.1.5 కోట్ల నుంచి రూ.1.8 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఇక రాము రాథోడ్ సినిమా పాటల విషయానికి వస్తే, ఒక్కో పాటకు సుమారు రూ.50 వేల నుంచి 1 లక్ష వరకూ పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం ఉన్నప్పటికీ, అధికారికంగా స్పష్టత లేదు.

Read more Photos on
click me!

Recommended Stories