Balakrishna: విజయశాంతిపై కోపంతో తన సినిమాని తానే ఫ్లాప్‌ చేసుకున్న బాలయ్య.. ఎన్బీకేలో ఈ యాంగిల్‌ కూడా ఉందా ?

Published : Nov 02, 2026, 04:36 PM IST

బాలయ్య మామూలోడు కాదు. విజయశాంతిపై కోపంతో తన సినిమానే ఫ్లాప్‌ చేయించుకున్నాడట. మరో తన సినిమాని అదే రోజు రిలీజ్‌ చేయించి చావు దెబ్బ కొట్టాడట. మరి ఆ సంగతేంటో చూద్దాం.

PREV
14
విజయశాంతి, బాలయ్య సక్సెస్‌ఫుల్‌ జోడీ

బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్‌లో చాలా సినిమాలు వచ్చాయి. విజయశాంతి తాను నటించిన వారిలో అత్యధిక సినిమాలు బాలయ్యతోనే చేసింది. అంతేకాదు వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఎక్కువగా సక్సెస్‌ రేట్‌ ఉంది. ఆ తర్వాత చిరంజీవితో విజయశాంతి ఎక్కువ మూవీస్‌ చేసింది. కానీ బాలయ్య, విజయశాంతి కాంబినేషన్‌ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. వెండితెరపై కూడా ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది.

24
నిప్పు రవ్వ సినిమా సమయంలో విజయశాంతి, బాలయ్య మధ్య డిస్టర్బెన్స్

అయితే అత్యంత హిట్‌ పెయిర్‌గా నిలిచిన విజయశాంతి, బాలయ్య మధ్య గొడవలు జరిగాయట. `నిప్పురవ్వ` సినిమా సమయంలో ఇష్యూ అయ్యిందట. దీనికి కోదండరామిరెడ్డి దర్శకుడు. ఈ సినిమాకి విజయశాంతినే నిర్మాత కావడం విశేషం. సినిమా రిలీజ్‌ టైమ్‌ వచ్చినా కూడా ఆయనకు పారితోషికం పూర్తిగా ఇవ్వలేదట. మరోవైపు దర్శకుడు కోదండరామిరెడ్డి కూడా మూవీని సరిగ్గా తీయలేకపోయారట. సగంలోనే వదిలేసే పరిస్థితి వచ్చిందట. అలాంటి సమయంలో ఇతరుల ఇన్‌ వాల్వ్ మెంట్‌తో సినిమాని పూర్తి చేశారట. తర్వాత ఏదేదో జరిగిందట. ఈ క్రమంలో విజయశాంతి, బాలయ్య మధ్య మనస్పర్థాలు వచ్చాయట. సినిమా షూటింగ్‌ చేసేందుకు బాలయ్య కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదట. మొత్తానికి ఎలాగోలా పూర్తి చేసి రిలీజ్‌ చేశారు.

34
బంగారు బుల్లోడుతో నిప్పు రవ్వ ని చావు దెబ్బ కొట్టించిన బాలయ్య

అయితే ఈ సినిమాకి పారితోషికం పూర్తిగా ఇవ్వకపోవడంతో హర్ట్ అయిన బాలయ్య కావాలని తన మరో సినిమాని అదే రోజుకి `నిప్పురవ్వ`కి పోటీగా రిలీజ్‌ చేయించారట. విజయశాంతిపై కోపంతో బాలయ్య తాను నటించిన మరో సినిమా `బంగారు బుల్లోడు` మూవీని రిలీజ్‌ చేయించారట. షూటింగ్‌కి టైమ్‌ పడుతున్నా, కావాలని వేగంగా పూర్తి చేయించి సరిగ్గా `నిప్పురవ్వ` రిలీజ్‌ రోజునే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేశారట. ఇందులో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్నీ మేళవింపుగా ఉండటంతో ఆడియెన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. `బంగారు బుల్లోడు` మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. అదే రోజు వచ్చిన `నిప్పురవ్వ` ఫ్లాప్‌ అయ్యింది. కానీ `బంగారు బుల్లోడు` మూవీ రిలీజ్‌ కాకపోతే `నిప్పురవ్వ` హిట్‌ అయ్యేదని తెలిపారు ప్రముఖ రైటర్‌, జర్నలిస్ట్ శ్రీకాంత్‌. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. విజయశాంతిపై కోపంతో, పారితోషికం విషయంలో వచ్చిన మనస్పర్థాల వల్ల బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడని, ఆయన తన సినిమాని మరో తన మూవీతోనే ప్లాప్‌ చేయించుకున్నాడని తెలిపారు.

44
నిప్పు రవ్వ ఫ్లాప్‌ అని ముందే చెప్పిన బాలయ్య

ఇదిలా ఉంటే అన్ స్టాపబుల్‌ షోలో రవితేజ పాల్గొన్న ఒక ఎపిసోడ్‌లో ఆసక్తికర కామెంట్‌ చేశాడు బాలయ్య. ఆ సినిమా క్లైమాక్స్ లో విలన్‌ పాత్ర చేసిన రాజా రవీంద్రని పట్టుకునే ఛేజింగ్‌ సీన్‌ ఉందట. అది తీస్తూనే ఉన్నారట. ఆ సమయంలో రాజా రవీంద్ర ఉండి. సార్‌ మీరా, నేనా సినిమాకి హీరో అని అడగ్గా, బాలయ్య ఉండి నేనే అన్నాడట. అప్పుడు ఏంటి సార్‌ ఇది. నా లాంటి వెదవని పట్టుకొని తాళి కట్టురా అంటే కట్టనా, అదంతా వదిలేసి ఈ ఛేజింగ్‌లు ఎందుకు అన్నాడట. ఆ దెబ్బతోనే బాలయ్య అనుకున్నాడట. ఈ సినిమా దొబ్బింది అని. ఈ విషయాన్ని రవితేజకి చెప్పారు. అయితే అందులో రాజా రవీంద్ర పాత్ర కోసం రవితేజ ఆడిషన్‌కి వెళితే తన స్థానంలో రాజా రవీంద్ర వచ్చాడట. పరుచూరి బ్రదర్స్ రికమండేషన్‌తో ఆయన్ని పెట్టుకున్నారని రవితేజ చెప్పడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories