పెద్ది సినిమా రిలీజ్ అయ్యి.. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ డేనే 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ హ్యాపీ మూమెంట్ లో రామ్ చరణ్ ఎక్కడున్నాడు? ఎవరికి కనిపించకుండా ఎక్కడికెళ్లాడు?
రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని దూసుకెళ్తోంది. థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ లో రన్ అవుతోంది. ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. సినిమా అంతా తన భుజాలపై మోశాడు మెగా పవర్ స్టార్. సెకండ్ హాఫ్ తో పాటు క్లైమాక్స్‌లో ఆయన చూపించిన ఎమోషనల్ సీన్స్,అభిమానులను కదిలించింది. చరణ్ నటనపై సోషల్ మీడియాలో అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
26
పెద్ది రిలీజ్ తరువాత కనిపించని మెగా హీరో.
పెద్ది సినిమా రిలీజ్ కు ముందు వరకు ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొన్న రామ్ చరణ్, విడుదలకు ఒక రోజు ముందు నుంచి కనిపించడం మానేశాడు. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదల తర్వాత జరిగిన పలు కార్యక్రమాల్లో కూడా ఆయన లేకపోవడంతో అభిమానుల్లో రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. ఆయన ఎక్కడికెల్లాడు..? చరణ్ కు ఏమయ్యిందని అభిమానులు ఎంక్వైరీ మొదలు పెట్టారు.
36
షూటింగ్ లో రామ్ చరణ్ కు గాయాలు..
‘పెద్ది’ చిత్రంలో కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్‌కు పలు గాయాలు అయినట్లు సమాచారం. ముఖ్యంగా ఆయన చేతికి తీవ్ర గాయం అయినట్లు తెలుస్తోంది. గాయం ఉన్నప్పటికీ ఫిజియోథెరపీ సహాయంతో షూటింగ్‌లో పాల్గొని మూవీని పూర్తి చేసినట్లు సమాచారం. అనంతరం వైద్యులు చేతికి శస్త్రచికిత్స అవసరం అని సూచించినట్లు తెలుస్తోంది.
ప్రమోషనల్ కార్యక్రమాల సమయంలో కూడా రామ్ చరణ్ తన చేతికి మెడికల్ బ్యాండ్ ధరించి కనిపించారు. ఈ గాయం గురించి ఆయన గతంలో మాట్లాడుతూ.. పెద్ది సినిమా ప్రమోషన్స్ పూర్తయ్యి, రిలీజ్ తరువాత శస్త్రచికిత్స చేయించుకుంటానని వెల్లడించారు. ప్రస్తుతం ఆపరేషన్ చేయించుకుంటే విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని, అందుకే ప్రమోషన్స్‌కు ఆటంకం కలగకుండా వాయిదా వేసుకున్నట్లు తెలిపారు.
56
చరణ్ లేకుండానే సినిమా చూసిన ఉపాసన
సినిమా కోసం రామ్ చరణ్ ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. ప్రమోషన్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ తన శస్త్రచికిత్సను కూడా వాయిదా వేసుకోవడంతో అభిమానులు ఆయన అంకితభావాన్ని ప్రశంసించారు.సినిమా విడుదలైన తర్వాత మూవీ యూనిట్ టీమ్ తో పాటు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా థియేటర్లలో సినిమా చూసింది. కానీ వారితో రామ్ చరణ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. తాజాగా నిర్వహించిన సక్సెస్ ప్రెస్‌మీట్‌లో కూడా ఆయన హాజరు కాలేదు.
66
ఆస్పత్రిలో చేరి ఉంటాడా?
దీంతో ఆయన చేతికి శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. రామ్ చరణ్ సన్నిహితుల సమాచారం ప్రకారం, ఆయనకు అపోలో ఆస్పత్రిలో చేతికి శస్త్రచికిత్స జరిగినట్లు, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతిలో ఉన్నందున, పూర్తిగా కోలుకున్న తర్వాత ‘పెద్ది’ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.