ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు బంధన్ షూటింగ్ స్పాట్ నుంచి సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్‌లు రజనీకాంత్‌ని చూసేందుకు అరుణాచలం సినిమా సెట్‌కి వచ్చారు. వాళ్లను చూడగానే మా హీరో వచ్చాడు అన్నట్టుగా నేను ఎక్కడ ఉన్నాను అన్నది మర్చిపోయి.. వెంటనే వెటనే సల్మాన్ ను కౌగిలించుకుని పలకరించాను. రజనీ సార్ ఇదంతా దూరం నుంచి చూస్తున్నారు. తర్వాత రజినీ సార్, సుందర్ సి అందరూ వారితో మాట్లాడారు.