రంభ 1992లో `ఆ ఒక్కటి అడక్కు` చిత్రంతో తెలుగు తెరకి హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. రాజేంద్రప్రసాద్ సరసన నటించింది. `ఏవండి ఆవిడ వచ్చింది`, `తొలి ముద్దు`, `రౌడీ అన్నయ్య`, `ముద్దుల ప్రియుడు`, `అల్లరి ప్రేమికుడు`, `అల్లుడా మజాకా`, `బొంబాయి ప్రియుడు`, `హిట్లర్`, `గణేష్`, `బావగారు బాగున్నారా?` వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది రంభ. ఆ తర్వాత ఐటెమ్ సాంగ్స్ తో ఊపేసింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా విదేశాల్లో పిల్లలు, ఫ్యామిలీకే పరిమితయ్యింది. అడపాదడపా సోషల్ మీడియాలో ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది రంభ.