Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?

Published : Sep 02, 2026, 04:03 PM IST

అల్లరి నరేష్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `రంభ ఊర్వశి మేనక`. చాలా రోజుల తర్వాత నరేష్‌ తన కామెడీ జోనర్‌లో చేసిన ఈ మూవీ ఎలా ఉందనేది ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. దీని ప్రకారం మూవీ ఎలా ఉందంటే?

PREV
15
`రంభ ఊర్వశి మేనక`తో రాబోతున్న అల్లరి నరేష్‌

అల్లరి నరేష్‌ కామెడీ సినిమాలకు కేరాఫ్‌. ఒకప్పుడు వరుసగా కామెడీ సినిమాలు చేసి మెప్పించారు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు సెలక్టీవ్‌గా వెళ్తున్నాడు. ఏడాదికి ఒక్క మూవీ కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అదే సమయంలో ఆయన యాక్షన్‌, థ్రిల్లర్‌ చిత్రాలు చేస్తూ వచ్చాడు. యాక్షన్‌ థ్రిల్లర్స్ ప్రారంభంలో విజయం సాధించాయి. కానీ ఆ తర్వాత అవి కూడా వర్కౌట్‌ కావడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు జోనర్‌ మార్చాడు. మళ్లీ తన కామెడీ జోన్‌లోకి వచ్చాడు. అందులో భాగంగా `రంభ ఊర్వశి మేనక` చిత్రంలో నటించాడు.

25
మళ్లీ కామెడీ సినిమా చేసిన అల్లరి నరేష్‌

కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సురభి, రాశీ సింగ్‌, విష్ణు ప్రియా భీమనేని, ప్రిషా సింగ్‌ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్‌, నరేష్‌ వీకే ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకాలపై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 4న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. కామెడీ ప్రధానంగా సాగాయి. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా ఇది సెన్సార్‌ పూర్తి చేసుకుంది. అలాగే ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ బయటకు వచ్చింది. దీని బట్టి చూస్తే మూవీ ఎలా ఉందంటే?

35
రంభ ఊర్వశి మేనక మూవీ కథ ఇదేనా?

సినిమా బేసిక్‌ లైన్‌ ఏంటనేది చూస్తే, వీకే నరేష్‌, అల్లరి నరేష్‌ తండ్రీకొడుకులు. వీరికి వంశ పారంపర్యంగా ఒక మ్యాజిక్‌ బుక్‌ ఉంటుంది. దానిపై సరైన విధంగా ముగ్గు వేస్తే రంభ, ఊర్వశి మేనకలు వస్తారు, కోరిన కోరికలు తీరుస్తారు అని నరేష్‌కి వీకే నరేష్‌ చెబుతారు. నరేష్‌కి హీరో కావాలనే కోరిక ఉంటుంది. అందుకోసం 25ఏళ్లుగా ముగ్గులు వేస్తూనే ఉంటాడు. కానీ రంభ(రాశి సింగ్‌), ఊర్వశి(విష్ణుప్రియ), మేనక(ప్రిషా సింగ్‌) రారు. ఎట్టకేలకు నరేష్‌ ప్రయత్నం ఫలిస్తుంది. ముగ్గురు దేవకన్యలు వస్తారు. మరి హీరో అవ్వాలనే కోరిక తీరిందా? వీరు ముగ్గురు భూలోకం వచ్చాక ఏం జరిగింది అనేది సినిమా కథ అని టాక్‌.

45
రంభ ఊర్వశి మేనక మూవీ సెన్సార్‌, ఫస్ట్ రివ్యూ

ఈ మూవీ సెన్సార్‌ పూర్తి చేసుకుంది. పలు కారణాలతో సెన్సార్‌ ఇబ్బందులు వచ్చాయి. ఆ తర్వాత యూ ఏ సర్టిఫికెట్‌ ఇచ్చారు. 16ఏళ్లు నిండినవాళ్లు ఈ మూవీని చూడొచ్చు. సినిమా నిడివి కూడా తక్కువగానే ఉంది. రెండు గంటల 20 నిమిషాలు మాత్రమే ఉండటం విశేషం. అయితే ఇప్పటికే మూవీని కొందరు చూశారు. అలాగే సినిమా టీమ్‌ రిపోర్ట్ ప్రకారం `రంభ ఊర్వశి మేనక` ఫస్ట్ రివ్యూ వచ్చింది. సినిమాలో కామెడీ హైలైట్‌గా నిలుస్తుందట. ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు కామెడీ ప్రధానంగా సాగుతుందని అంటున్నారు. అల్లరి నరేష్‌, వీకే నరేష్‌ తండ్రీకొడుకులుగా చేసే ఫన్‌ హిలేరియస్‌గా ఉంటుందని టాక్‌. అదే సమయంలో ఇంద్రుడిగా వెన్నెల కిశోర్‌ ఎంట్రీ తర్వాత ఆ ఫన్‌ మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఫస్టాఫ్‌ రెగ్యూలర్‌గానే ఉంటుందని, సెకండాఫ్‌ మాత్రం కామెడీ అదిరిపోతుందని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనికితోడు రాశి సింగ్‌, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్‌ గ్లామర్‌ సినిమాకి మరో ఎట్రాక్షన్‌ అని, ముగ్గురు హీరోయిన్లని మరింత గ్లామరస్‌గా చూపించారట. యూత్‌ టార్గెట్‌గా ఆయా అంశాలుంటాయని సమాచారం.

55
రంభ ఊర్వశి మేనక లో మైనస్‌ ఇదేనా?

సినిమాలో కామెడీతోపాటు కోర్‌ ఎమోషన్‌ కూడా అదిరిపోయిందని, నవ్విస్తూ, చివరికి ఎమోషన్స్ తో హార్ట్ టచ్‌ చేసేలా సినిమా సాగుతుందని చెబుతున్నారు. అయితే కామెడీ విషయంలోనే కొంత మైనస్‌ వినిపిస్తుంది. అన్ని చోట్ల అనుకున్నంతగా వర్కౌట్‌ కాలేదని, కొంత ఇరికించినట్టుగానే ఉంటుందని, మూవీ లౌడ్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఫస్టాఫ్‌లో అంతగా కామెడీ సీన్లు పండలేదని టాక్‌. దీనికితోడు నరేష్‌ మార్క్ కామెడీ కూడా కొంత రొటీన్‌గానే అనిపిస్తుందని చెబుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న మైనస్‌లు మాత్రమే ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్‌గా పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. అయితే ఇటీవల చాలా సినిమాల్లో ట్రైలర్‌లోనే కామెడీ కనిపిస్తుంది. సినిమాల్లో ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. దీంతో థియేటర్లో ఆడియెన్స్ ని డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. మరి `రంభ ఊర్వశి మేనక` ఏ మేరకు మ్యాజిక్‌ చేస్తుంది? నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొడతాడా? అనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories