Ramayana 19 Days Box Office: దారుణంగా పడిపోయిన రామాయణం కలెక్షన్లు.. కనీసం పుష్ప 2 ని అయినా దాటుతుందా?

Published : Nov 24, 2026, 03:42 PM IST

Ramayana 19 Days Box Office: యష్‌, రణ్‌బీర్ కపూర్‌, సాయిపల్లవి నటించిన 'రామాయణం: పార్ట్ 1' కలెక్షన్స్ సోమవారం భారీగా పడిపోయాయి. ఓవర్సీస్‌లో మంచి వసూళ్లు వస్తున్నా.. దంగల్, పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేయాలంటే సినిమా ఇంకా చాలా రాబట్టాల్సి ఉంది.

PREV
14
పడిపోయిన రామాయణం కలెక్షన్లు, ధురంధర్‌ 2ని టచ్‌ చేస్తుందా?

నితీష్ తివారీ రూపొందించిన 'రామాయణం: పార్ట్ 1' సినిమా బాక్సాఫీస్ దగ్గర సోమవారం దారుణంగా పడిపోయింది. సండే వరకు బాగానే లాగినా, సోమవారం కలెక్షన్స్ ₹15 కోట్ల మార్క్ కూడా దాటలేదు. ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం సినిమా మంచి వసూళ్లని రాబడుతుండటంతో టీమ్‌కి కాస్త ఊరటనిస్తోంది. కానీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ‘ధురంధర్ 2: ది రివెంజ్’ (2026) రికార్డును, అలాగే `పుష్ప 2` రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్‌గా ఉన్న ‘దంగల్’ (2016) రికార్డును అందుకోవడం అయితే ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

24
రామాయణం 19వ రోజు సోమవారం కలెక్షన్లు

సోమవారం ₹12.70 కోట్ల కలెక్షన్స్

బాక్సాఫీస్ ట్రాకర్ సాక్నిల్క్ (Sacnilk) రిపోర్ట్ ప్రకారం.. నవంబర్ 23, సోమవారం నాడు 'రామాయణం' ఇండియాలో 15,696 షోల ద్వారా ₹12.70 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఆదివారం ఈ సినిమాకు ₹35.60 కోట్లు వచ్చాయి. దాంతో పోలిస్తే సోమవారం వసూళ్లు ఏకంగా 64.33% పడిపోయాయి. దీంతో ఇండియాలో ఈ సినిమా టోటల్ నెట్ కలెక్షన్ ₹955.45 కోట్లకు చేరింది. ఇండియాలో గ్రాస్ కలెక్షన్ ₹1,141.65 కోట్లు కాగా.. వరల్డ్ వైడ్ మొత్తం కలెక్షన్ ₹1,704.65 కోట్లకు చేరుకుంది.

3D, 2D షోల ఆక్యుపెన్సీ ఇలా..

హిందీ మార్కెట్‌లో సోమవారం 'రామాయణం' 3D వెర్షన్‌కు 19.02% థియేటర్ ఆక్యుపెన్సీ రికార్డ్ అయింది. 2D వెర్షన్ ఆక్యుపెన్సీ 14.42%గా ఉంది. 3D మార్నింగ్ షోలకు 8.31% రాగా.. మధ్యాహ్నానికి అది 17.15%కి పెరిగింది. ఈవినింగ్ షోలకు 23.08%, నైట్ షోలకు 27.54% ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక 2D వెర్షన్ చూసుకుంటే.. మార్నింగ్ షోలకు 8.17%, మధ్యాహ్నం 13.17%, సాయంత్రం 15.75% కాగా, రాత్రికి 20.58% ఆక్యుపెన్సీ నమోదైంది.

34
ఇండియన్‌ బాక్సాఫీస్ దగ్గర ‘పుష్ప 2’ కంటే వెనకే..

రిలీజై మూడు వారాలు అవుతున్నా 'రామాయణం' ఇంకా మంచి వసూళ్లనే రాబడుతున్నప్పటికీ.. ఇండియన్ మార్కెట్‌లో సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ (2024) సినిమా కంటే వెనకబడే ఉంది. రామాయణం ఇండియా నెట్ కలెక్షన్ ₹955.45 కోట్లు కాగా, 'పుష్ప 2' తన థియేట్రికల్ రన్‌ను ₹1,234.10 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో ముగించింది.

ఇండియా నెట్ కలెక్షన్లలో ‘రామాయణం’ కంటే ముందున్న సినిమాలు:

‘పుష్ప 2: ది రూల్’ – ₹1,234.10 కోట్లు

‘ధురంధర్ 2: ది రివెంజ్’ – ₹1,149.30 కోట్లు

‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ – ₹1,030.42 కోట్లు

ఓవర్సీస్‌లో ₹563 కోట్ల వసూళ్లు

ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం 'రామాయణం' దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు విదేశాల్లో ఈ సినిమా ₹563 కోట్లు రాబట్టింది. దీంతో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. అయినా సరే, గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర చాలా ఇండియన్ సినిమాల రికార్డులను దాటాల్సే ఉంది.

44
వరల్డ్ వైడ్ కలెక్షన్లలో ‘రామాయణం’ కంటే ముందున్న సినిమాలు:

‘పుష్ప 2: ది రూల్’ – ₹1,742.10 కోట్లు

‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ – ₹1,788.06 కోట్లు

‘ధురంధర్ 2: ది రివెంజ్’ – ₹1,813.39 కోట్లు

‘దంగల్’ – ₹2,070.30 కోట్లు

ప్రస్తుతం వరల్డ్ వైడ్ ₹1,704.65 కోట్లు వసూలు చేసిన 'రామాయణం'.. పుష్ప 2, బాహుబలి 2, ధురంధర్ 2 రికార్డులను బ్రేక్ చేయాలంటే ఇంకా బాగా కలెక్ట్ చేయాలి. దంగల్ సాధించిన ₹2,070.30 కోట్ల రికార్డును దాటాలంటే మాత్రం చాలా కష్టపడాల్సిందే.

ఓవర్సీస్ మార్కెట్‌లో ఇలాగే మంచి రన్ కొనసాగితే, గ్లోబల్ కలెక్షన్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కానీ ఇండియన్ సినిమా ఆల్ టైమ్ బాక్సాఫీస్ రికార్డులను 'రామాయణం' బ్రేక్ చేస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో వచ్చే వసూళ్ల పైనే ఆధారపడి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories