రామాయణంలో భారీ తారాగణం..
రామాయణం సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. రవి దూబే లక్ష్మణుడిగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. ఇక హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, ఇంద్రుడిగా కునాల్ కపూర్ కనిపించనున్నారు.
ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, యశ్ 'మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్' సంస్థలతో కలిసి నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత హన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం మరో విశేషం.