Ramayana Day 2 Collections: రామాయణం అనే ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన మూవీ `రామాయణం`. రణ్ బీర్ కపూర్, సాయిపల్లవి, యష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. రెండు రోజుల్లో కలెక్షన్లు ఎంత? పెరిగాయా? తగ్గాయా?
రామాయణం ఆధారంగా చేసుకొని అడపాదడపా సినిమాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారి `రామాయణం` మూవీని తెరకెక్కించారు. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటించారు. దాదాపు 4వేల కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందింది. అందులో భాగంగా మొదటిభాగం దీపావళి స్పెషల్‌గా నవంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. చాలా వరకు పాజిటివ్‌గానే వినిపించింది. విజువల్‌గా గ్రాండియర్‌గా ఉంది. అదే సమయంలో రామాయణంలోని కొత్త కోణాలను ఆవిష్కరించారు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు రాముడి కోణంలోనే చూపించారు. కానీ ఇప్పుడు రావణుడి కోణంలో సినిమా ప్రారంభం కావడం విశేషం. రావణుడి అంశాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. దీంతో రామాయణంలోని మరో యాంగిల్‌ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇదే ఈ సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు.
23
రామాయణం మూవీ రెండు రోజుల కలెక్షన్లు.. తెలుగులో ఎంతంటే?
సినిమా విడుదలై రెండు రోజులవుతుంది. మరి ఈ చిత్రానికి కలెక్షన్లు ఎలా ఉన్నాయి? పెరిగాయా తగ్గాయా? 4000 కోట్ల సినిమా రేంజ్‌లో వసూళ్లు ఉన్నాయా? అనేది చూస్తే, ఈ చిత్రానికి భారీగానే వసూళ్లు వస్తున్నాయి. కానీ బడ్జెట్‌తో పోల్చితే ఆ స్థాయిలో వసూళ్లు రావడం లేదు. మొదటి రోజు ఇండియాలో రూ.77.50కోట్ల గ్రాస్ వస్తే, రెండో రోజు రూ.57.30కోట్లు వచ్చాయి. అంటే ఇరవై కోట్లు తగ్గాయి. ఇక ఓవర్సీస్‌లో రూ.35కోట్లు వచ్చాయి. రెండు రోజుల్లో ఓవర్సీస్‌లో రూ.86.25కోట్లు, ఇండియా గ్రాస్ రూ.134.80కోట్ల గ్రాస్, రూ.112.90కోట్ల నెట్ వచ్చాయి. ఓవరాల్‌గా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.221కోట్లు రాబట్టింది. ఇక తెలుగు కలెక్షన్లు చూస్తే, రెండు రోజుల్లో ఇది రూ.10.75కోట్లు రాబట్టింది.
33
బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?
ఈ శనివారం, ఆదివారం సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఈ మూడు రోజులు వసూళ్లు బాగానే ఉంటాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి ఏంటనేది ప్రశ్న. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.2000-2500కోట్ల గ్రాస్ కలెక్షన్లుగా ఉంది. అంటే బాహుబలి 2, పుష్ప 2, ధురంధర్ 2 సినిమాల వసూళ్లని దాటేయాలి. మరి అది సాధ్యమా? ఆ స్థాయిలో రాబడుతుందా అనేది ప్రశ్నగా మారింది. ఈ రెండు మూడు రోజుల్లో వచ్చే వసూళ్లని బట్టి అది ఆధారపడి ఉంటుంది. కానీ కష్టమే అనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల నుంచి వస్తోంది. తెలుగులో ఈ మూవీకి దాదాపు వంద కోట్లు రావాలి. అప్పుడే సేఫ్ అవుతారు నిర్మాత దిల్ రాజు. ఆయన తెలుగు రైట్స్ రూ.54కోట్లకి తీసుకున్నట్టు సమాచారం. మరి ఏం చేస్తుందో చూడాలి.