బిగ్ బాస్ హౌస్ లో 61వ రోజు కొత్త కెప్టెన్ గా వంశీ ఎంపికయ్యారు. కెప్టెన్సీ కోసం త్రిగుణ్, స్వేతా, దేబ్జానీ, వంశీ పోటీ పడగా వంశీ విజయం సాధించాడు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ హౌస్ కొత్త కెప్టెన్ గా వంశీ అవతరించాడు. అంతకు ముందు త్రిగుణ్.. వర్షిణి, ముకేశ్ మధ్య ఫుడ్ విషయంలో వివాదం జరిగింది. వర్షిణి ఫుడ్ వేస్ట్ చేస్తోంది అని భావించిన త్రిగుణ్ ఆమెకి టీ లేకుండా శిక్ష విధించాడు. దీనితో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వర్షిణి తరుపున ముకేశ్.. త్రిగుణ్ తో గొడవ పెట్టుకున్నాడు.
24
వాళ్లకు కూడా ఒక ఛాన్స్
రివేంజ్ అండ్ రివార్డ్ లో భాగంగా విజయం సాధించిన వాళ్ళు వచ్చే వారం వాళ్ళ ఫ్యామిలీలని కలుసుకుంటారు. రివేంజ్ కి గురికాబడిన వాళ్ళకు మాత్రం ఫ్యామిలీలని కలుసుకునే అవకాశం లేదని బిగ్ బాస్ తెలిపారు. కానీ వాళ్లకు కూడా చివరి అవకాశం ఇచ్చారు. ఆర్కే, అమన్, వర్షిణి, ముకేశ్ రివేంజ్ కి గురైన సంగతి తెలిసిందే. ఆర్కే, అమన్ ఒక పెయిర్ గా.. ముకేశ్, వర్షిణి ఒక పెయిర్ గా ఏర్పడ్డారు. ఈ గేమ్ లో విజయం సాధించిన పెయిర్ లో ఒక్కరికి మాత్రమే వాళ్ళ ఫ్యామిలీని కలుసుకునే అవకాశం ఉంటుంది అని బిగ్ బాస్ తెలిపారు.
34
వర్షిణి, ముకేశ్ విజయంలో వివాదం
పెయిర్ లోని ఒక సభ్యులు స్టాండ్ ని బ్యాలెన్స్ చేస్తుంటే దానిపై మరో సభ్యుడు బ్రిక్స్ తో ఇంటిని ఫామ్ చేయాలి. అలా ఎవరైతే ముందుగా కంప్లీట్ చేస్తారో వాళ్లే విజేతలు. ముందుగా ముకేశ్, వర్షిణి టాస్క్ కంప్లీట్ చేశారు. కానీ వాళ్ళు ఎక్కువ సేపు బ్యాలెన్స్ చేయలేదు అని, ఇల్లు త్వరగా కూలిపోయింది అని వివాదం మొదలైంది. కానీ సంచాలక్ గా ఉన్న నరేష్ ముకేశ్, వర్షిణి విజయం సాధించారు ఐ భావించారు. వాళ్లనే విజేతలుగా ప్రకటించారు. వర్షిణి, ముకేశ్ లలో ఒకరికి మాత్రమే వాళ్ళ ఫ్యామిలీని కలుసుకునే ఛాన్స్ ఉంటుంది. దీనితో ముకేశ్ కోసం వర్షిణి త్యాగం చేసి అతడికే అవకాశం ఇచ్చింది. ఈ టాస్క్ లో తమకు అన్యాయం జరిగింది అని అమన్, ఆర్కే భావించగా నరేష్ వారిపై కోపంతో ఊగిపోయాడు. నా తప్పు ఉంటే శనివారం రోజు నేనే శిక్ష అనుభవిస్తా అని కేకలు పెట్టాడు.
ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్స్ గా త్రిగుణ్, దేబ్జానీ, స్వేతా, వంశీ పాల్గొన్నారు. వీరిలో వంశీకే ఎక్కువ మంది సపోర్ట్ చేయడంతో అతడు విజయం సాధించి బిగ్ బాస్ హౌస్ కొత్త కెప్టెన్ అయ్యారు.