Dark Night OTT: అక్రమ సంబంధం చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 8.3 రేటింగ్!

Published : Nov 07, 2026, 08:10 AM IST

Dark Night OTT: క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'డార్క్ నైట్' ఇప్పుడు ఆహా ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 8.3 రేటింగ్ రావడం విశేషం.

PREV
13
అక్రమ సంబంధం చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్..

థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు పెద్దగా సక్సెస్ కాని కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చాక మాత్రం అదరగొడుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమానే ఓటీటీలో తెగ సందడి చేస్తోంది. ఆ సినిమా పేరే 'డార్క్ నైట్'.

వివాహేతర సంబంధం, భార్యాభర్తల మధ్య గొడవలు, మోసం, ఊహించని మలుపుల చుట్టూ తిరిగే ఈ సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంది. అంతేకాదు, ఐఎండీబీలో ఈ మూవీకి 8.3 రేటింగ్ కూడా వచ్చింది. ఇంతకీ ఈ సినిమా కథేంటి? ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంటున్న విషయం ఏంటి? ఇక్కడ తెలుసుకుందాం.

థియేటర్లలో సైలెంట్.. ఓటీటీలో వైలెంట్!

బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అంచనాలు లేకుండా, ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయ్యే కొన్ని సినిమాలు ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ అవుతాయి. కథ, స్క్రీన్ ప్లే బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని చెప్పడానికి 'డార్క్ నైట్' సినిమానే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదొక ఎమోషనల్ డార్క్ క్రైమ్ థ్రిల్లర్. మార్చి 13న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా.. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోవడం, ప్రమోషన్స్ చేయకపోవడంతో జనాలకు పెద్దగా రీచ్ కాలేదు.

కానీ రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు వ్యూవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'డార్క్ నైట్' ఐఎండీబీలో 8.3 రేటింగ్ తెచ్చుకుంది. క్రైమ్, సస్పెన్స్, డార్క్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే వాళ్లలో ఈ సినిమా మంచి క్యూరియాసిటీ పెంచుతోంది.

23
'డార్క్ నైట్' కథేంటి?

అలెక్స్ అనే లాయర్ పెద్దలు కుదిర్చిన పెళ్లిలో హేమను పెళ్లి చేసుకుంటాడు. కొత్త జీవితం మీద ఎన్నో కలలతో అత్తింటికి వచ్చిన హేమకు అలెక్స్ ప్రవర్తన షాక్ ఇస్తుంది. ఎందుకంటే అలెక్స్ తన ఆఫీసులో పనిచేసే సోఫియాతో ఎఫైర్ పెట్టుకుంటాడు.

ఈ విషయం తెలుసుకున్న హేమ తీవ్రంగా బాధపడుతుంది. భర్తకు దూరంగా ఒంటరిగా బతకాలని డిసైడ్ అవుతుంది. కానీ, అటు సోఫియా మరో వ్యక్తితో చనువుగా ఉండటం చూసిన అలెక్స్‌కు తను మోసపోయానని అర్థమవుతుంది. తన తప్పు తెలుసుకుని బాధపడిన అతను, మళ్లీ భార్య హేమ దగ్గరికి వెళ్లి క్షమాపణ అడగాలనుకుంటాడు.

హేమ జీవితంలో మరో మలుపు!

సరిగ్గా ఇదే టైమ్‌లో హేమ జీవితంలోకి ఆమె పాత స్నేహితుడు రోషన్ ఎంట్రీ ఇస్తాడు. హేమ అతన్ని కేవలం మంచి స్నేహితుడిలా చూస్తే, రోషన్ మనసులో మాత్రం వేరే ఆలోచనలు ఉంటాయి. ఇటు భర్తను అర్థం చేసుకుని మళ్లీ అలెక్స్‌తో కలిసి బతకాలని హేమ అనుకుంటున్న టైమ్‌లోనే ఆమె జీవితంలో ఊహించని ఒక సీరియస్ సంఘటన జరుగుతుంది.

అసలు ఆ సంఘటన ఏంటి? అలెక్స్, హేమ, రోషన్, సోఫియా జీవితాల్లో ముందుకు ఎలాంటి మార్పులు వస్తాయి? ఈ సంఘటనల వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనేదే ఈ సినిమాలోని ఆసక్తికరమైన పాయింట్. సంబంధాల మధ్య ఉండే చిక్కులు, నమ్మకం, ద్రోహం, ఊహించని మలుపులతో ప్రేక్షకులను చివరి వరకు కూర్చోబెట్టే ప్రయత్నం చేసింది చిత్రబృందం.

33
ఎవరెవరు నటించారు? ఎక్కడ చూడొచ్చు?

ఈ సినిమాలో హేమ పాత్రలో పూర్ణ (శమ్నా కాసిమ్) నటించింది. తన యాక్టింగ్‌తో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. త్రిగుణ్, విదార్థ్, శుభశ్రీ రాయగురు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. డార్క్ థ్రిల్లర్, క్రైమ్, సస్పెన్స్ కథలను ఇష్టపడే వాళ్లు ఈ వీకెండ్‌లో 'డార్క్ నైట్' సినిమాను కచ్చితంగా చూడొచ్చు. థియేటర్లలో పెద్దగా సౌండ్ చేయకపోయినా, ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమాను మీ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories