ఇన్నాళ్లు ఎంత మంది చెప్పినా ఆ పని చేయని అనసూయ జబర్దస్త్ చివరి ఎపిసోడ్ లో చేసిందే!

Published : Jul 28, 2022, 10:53 PM ISTUpdated : Jul 28, 2022, 10:58 PM IST

జబర్దస్త్ నుండి మరో జెమ్ అవుట్. యాంకర్ అనసూయ ఈ లెజెండరీ కామెడీ షోకి గుడ్ బై చెప్పేసింది. ఈ వారం ఎపిసోడ్ అనంతరం అనసూయ జబర్దస్త్ లో కనిపించరు. తన లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో అనసూయ ఇదే విషయాన్ని ధృవీకరించారు.

PREV
18
ఇన్నాళ్లు ఎంత మంది చెప్పినా ఆ పని చేయని అనసూయ జబర్దస్త్ చివరి ఎపిసోడ్ లో చేసిందే!
Anasuya Bharadwaj


జబర్దస్త్ (Jabardasth)ఎపిసోడ్ కోసం ధరించిన కాస్ట్యూమ్స్ లో ఫోటో షూట్ చేసిన అనసూయ... ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోలతో పాటు కొన్ని కామెంట్స్ పెట్టారు. కృతజ్ఞతా పూర్వకంగా వెళ్ళిపోతున్నట్లు చెప్పిన అనసూయ, అనేక తీపి జ్ఞాపకాల సమాహారంగా జబర్దస్త్ ఉందని పోస్ట్ చేశారు. మొత్తంగా అనసూయ నిష్క్రమణం జబర్దస్త్ అభిమానులకు బాధించే అంశమే. 

28
Anasuya Bharadwaj


చివరి ఎపిసోడ్ లో అనసూయలో చాలా మార్పు కనిపించింది. సరిగ్గా గమనిస్తే ఆమె నిండుగా తయారయ్యారు. శారీలో పెద్దగా స్కిన్ షోకి అవకాశం లేకుండా అనసూయ సిద్ధం కావడం మనం చూడవచ్చు. నిజానికి చాలా కాలంగా సాంప్రదాయ వాదులు అనసూయ నుండి కోరుకుంటుంది ఇదే.. 

38
Anasuya Bharadwaj

అనసూయ(Anasuya) పొట్టిబట్టలపై చాలా కాలంగా వివాదం నడుస్తుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే టెలివిజన్ షోలో అలాంటి బట్టలు ధరించడం దారుణమంటూ ఆమెపై విమర్శలు గుప్పించిన సందర్భాలు అనేకం. అనసూయ ఈ విమర్శలను ఏళ్లుగా తిప్పికొడుతూ వస్తుంది.
 

48
Anasuya Bharadwaj


తన డ్రెస్సింగ్ స్టైల్ పై ఎవరు కామెంట్ చేసినా అనసూయ అసలు ఒప్పుకోరు. నా బట్టలు నా ఇష్టం. నాకు సౌకర్యంగా ఉన్నంత వరకు ఎలాంటి బట్టలైనా వేసుకుంటాను. నేను ఎలాంటి బట్టలు ధరించాలో చెప్పడానికి మీరెవరు అంటుంది. తనని, తన బట్టలను జడ్జి చేస్తే అనసూయ అగ్గిమీద గుగ్గిలమవుతుంది. 

58
Anasuya Bharadwaj


ఆ మధ్య సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఇదే విషయమైన సున్నితమైన ఆరోపణ చేశారు. అందమైన అనసూయకు పొట్టి బట్టలు కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆమె ఎలా ఉన్నా ప్రేక్షకులు చూస్తారు అన్నారు. అంత పెద్ద నటుడ్ని కూడా ఈ విషయంలో అనసూయ వదల్లేదు. దారుణమైన వ్యక్తిగత ఆరోపణలతో కౌంటర్లు విసిరింది. 

68
Anasuya Bharadwaj


అయితే అనసూయలో ఎట్టకేలకు మార్పు వచ్చింది. జబర్దస్త్ చివరి ఎపిసోడ్ లో ఆమె ధరించిన డ్రెస్ చూస్తే అర్థమవుతుంది. అనసూయ ఈ ఎపిసోడ్ కోసం చీరలో రెడీ అయ్యారు. గతంలో అనసూయ చీరలు ధరించినా గ్లామరస్ ఫోజులతో స్కిన్ షో చేసేది. 

78
Anasuya Bharadwaj


భిన్నంగా అనసూయ చాలా పద్దతిగా కనిపించింది. ఇక అనసూయలో ఈ మార్పు కొట్టించినట్లు కనిపిస్తుండగా... ఇన్నాళ్లు ఎంత మంది విమర్శించినా మారని అనసూయ చివరకు తనకు తాను మారింది అంటున్నారు. అనసూయ యాంకర్ గా చేస్తున్న ఇతర షోస్ లో కూడా ఆమె పద్దతిగా దుస్తులు ధరిస్తున్నారు. 

88
Anasuya Bharadwaj

యాంకర్ అనసూయ ఈ లెజెండరీ కామెడీ షోకి గుడ్ బై చెప్పేసింది. ఈ వారం ఎపిసోడ్ అనంతరం అనసూయ జబర్దస్త్ లో కనిపించరు. తన లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో అనసూయ ఇదే విషయాన్ని ధృవీకరించారు.

click me!

Recommended Stories