దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమా స్థాయిని పెంచారు. `బాహుబలి`తో అన్ని బారియర్స్ బ్రేక్ చేశారు. లాంగ్వేజ్ బారియర్స్, మార్కెట్ బారియర్స్, కలెక్షన్ల బారియర్స్, బడ్జెట్ బారియర్స్ ఇలా అన్నింటిని బ్రేక్ చేశాడు. మన ఇండియన్ సినిమా సత్తా ఏంటో చూపించారు. అందులోనూ తెలుగు సినిమాని ప్రపంచానికి ముఖచిత్రంగా మార్చేశారు.
బాలీవుడ్ అప్పటి వరకు ఇండియన్ మూవీస్‌కి ఫేస్‌ఆఫ్‌గా ఉండేది. కానీ తెలుగు బిగ్గిస్ట్ ఇండిస్ట్రీగా మారడంలో ఆయన పాత్ర కీలకమని చెప్పొచ్చు. `ఆర్‌ఆర్‌ఆర్`తో ఇండియాకి ఆస్కార్ కలని నెరవేర్చాడు. ప్రస్తుతం ఆయన మన తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
`ఆర్‌ఆర్‌ఆర్`తో ఆస్కార్‌ని సాధ్యం చేసిన రాజమౌళి ఎంతటి పెద్ద దర్శకుడు అయినా ఇంట్లో మాత్రం సాధారణ భర్త అనే చెప్పాలి. సమాజంలో భార్యల వద్ద భర్తలు ఎలా ఉంటారో అలానే ఉంటారు. అంతేకాదు ఇంకా చాలా మంది చేయని పనులు చేస్తుంటారు. అందులో భాగంగా జక్కన్న.. తన భార్య రమా రాజమౌళి చెప్పిన మాట వినాల్సిందే.
ఆమె విషయంలో మాత్రం సినిమా ఇమేజ్, క్రేజ్ పనిచేయదు. అంతేకాదు ఇంట్లో పనులు కూడా చేయాల్సిందే నట. ఫ్రీ టైమ్‌లో ఇల్లు తూడ్చడం, అంట్లు కడగడం లాంటి పనులు కూడా చేస్తుంటారని, ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
అంతేకాదు ప్రతి రోజూ రాత్రి పడుకునే సమయంలో మరో పని మాత్రం కచ్చితంగా చేయాల్సిందేనట. ఈ విషయంలో ఒక అగ్రిమెంట్ మీద రాజమౌళి, రమా రాజమౌళి ఉంటారట. సినిమాలు తీసే సమయంలో, అంటే షూటింగ్ ఉన్న సమయంలో భార్య రమా.. రాజమౌళి కాళ్లు నొక్కాలి. షూటింగ్ లేని సమయంలో రాజమౌళి భార్య రమా కాళ్లు నొక్కాలి. ఇలా ఒక ఒప్పందం ప్రకారం ఈ ఇద్దరు ఉంటారని రాజమౌళి తెలిపడం విశేషం.
కొన్నేళ్ల క్రితం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఏంటంటే.. తాను(రమా) కాళ్లు ఎప్పుడో ఒకసారి నొక్కుతుందని, ఆ రూల్‌ని బ్రేక్ చేస్తుందని, కానీ తనకే రోజూ ఆ డ్యూటీ పడుతుందని, పడుకునే ముందు నాకు మాత్రం ఆ పని తప్పడం లేదని వెల్లడించారు జక్కన్న.
ఎంతటి గొప్ప దర్శకుడైనా భార్య వద్ద మాత్రం అణిగి మణిగి ఉండాల్సిందే, ఆమె ప్రేమకు బానిసనే అనే విషయాన్ని చాటి చెప్పారు రాజమౌళి. అయితే ఇదంతా వాళ్ల మధ్య ప్రేమకి నిదర్శనంగా నిలుస్తుందని, తాను గొప్ప దర్శకుడనే గర్వం మాత్రం ఇంట్లోకి రానివ్వకుండా, తన భార్య కోసం అంతటి పని చేయడం గొప్ప విషయమనే చెప్పాలి. అ
ది జక్కన్న డౌట్ టూ ఎర్త్ మెంటాల్టీని, హుందాతనాన్ని చాటి చెబుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే రమా రాజమౌళి కూడా సినిమాలకు పనిచేస్తుంది. రాజమౌళి చేసే చిత్రాలకు ఆమెనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తుంది. కీరవాణి భార్య వల్లి, రమా కాస్ట్యూమ్స్ చూసుకుటారు.