ఎపిసోడ్ ప్రారంభంలో.. రామ తన తమ్ముడు అఖిల్ మాట్లాడిన మాటలు తలుచుకొని బాధపడుతూ కనిపిస్తాడు. అదే సమయంలో అక్కడికి జ్ఞానంబ వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే రామ తన తల్లిని చూసి పట్టుకొని ఒక దగ్గర కూర్చోబెడతాడు. ఇక విష్ణు, గోవిందరాజులు వచ్చి ఏం జరిగింది అని భయపడుతూ ఉంటారు. వెంటనే గోవిందరాజులు భోజనం మానేస్తే నీ బాధ తీరుతుందా అని బాధపడుతూ అడుగుతాడు.