ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో.. జానకిని కేసు వెనక్కి తీసుకోమని రామ చెబుతూ ఉంటాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి అఖిల్ ని విడిపించి వద్దామని జానకిని బ్రతిమాలితో ఉంటాడు. దాంతో జానకి ఈ విషయంలో నన్ను ఒత్తిడికి చేయకండి అని అంటుంది. ఆ తర్వాత జానకి తన అత్తగారిని భోజనం చేయమని అనడంతో.. కన్నా కొడుకు జైల్లో ఉంటే ముద్ద ఎలా సహిస్తుంది అని అంటుంది జ్ఞానంబ.