Bigg Boss Telugu 6: శ్రీసత్యకు దొరికిన మరో బకరా... నెక్స్ట్ బలి అయ్యేది శ్రీహానేనా?

Published : Nov 10, 2022, 12:23 PM ISTUpdated : Nov 10, 2022, 12:30 PM IST

శ్రీసత్య మైకంలో పడి తొందరగా దుకాణం సర్దాడు అర్జున్ కళ్యాణ్. మనోడు హౌస్ కి వచ్చిన ఫస్ట్ డే నుండి ఆమె ఆరాధనలోనే మునిగిపోయాడు. అర్జున్ ఎలిమినేటై వెళ్లిపోగా శ్రీహాన్ ఆ బాధ్యత తీసుకున్నాడనే టాక్ వినిపిస్తుంది.   

PREV
15
Bigg Boss Telugu 6: శ్రీసత్యకు దొరికిన మరో బకరా... నెక్స్ట్ బలి అయ్యేది శ్రీహానేనా?
Bigg Boss Telugu 6

కొందరు కష్టపడి గేమ్ ఆడి ముందుకు వెళతారు. మరికొందరు ఇతరుల కష్టాన్ని, బలహీనతలను సొమ్ము చేసుకొని ముందుకు వెళతారు. రెండో రకం లిస్ట్ లో కంటెస్టెంట్ శ్రీసత్య పేరు ఖచ్చితంగా ఉంటుంది. తన వెనుకబడుతున్న అర్జున్ ని కావాల్సినంత వరకు వాడుకొని శ్రీసత్య తెలివిగా కొన్ని గేమ్స్, టాస్క్ నుండి గట్టెక్కించింది. దానికి హోటల్ టాస్క్ గొప్ప ఉదాహరణ శ్రీసత్య మైకంలో ఉన్న అర్జున్ తన వద్ద ఉన్న డబ్బులు మొత్తం ఆమెకు ఇచ్చేశాడు.

25
Bigg Boss Telugu 6


ఆ కారణంగా శ్రీసత్య గేమ్ లో ముందుకు వెళ్ళింది అర్జున్ మాత్రం అవుట్ అయ్యాడు. అర్జున్ ఎలిమినేషన్ లో శ్రీసత్య పాత్ర చాలా ఉంది. తన చుట్టూ తిప్పుకొని అతను గేమ్ ఆడకుండా చేసింది. ఇందులో అర్జున్ తప్పు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా శ్రీసత్యపై ఉన్న ఫోకస్ గేమ్ మీద లేదని ప్రేక్షకులకు బయటకు పంపేశారు. అర్జున్ అలా వెళ్లిపోయాడో లేదో శ్రీసత్య శ్రీహాన్ కి దగ్గరైంది. వారిద్దరూ ఇప్పుడు ఒక టీమ్ గా ఉంటున్నాడు. 

35
Bigg Boss Telugu 6

స్నేహానికి మించి కొంచెం అడ్వాన్స్ అయ్యారనే వాదన కూడా ఉంది. ఇనయా ఆరోపణ అదే. శ్రీహాన్ మాత్రం మా రిలేషన్ కి ఒక పేరుంది. క్లారిటీ ఉందని వాదించి ఇనయా ఆరోపణ ఖండించాడు. శ్రీహాన్, శ్రీసత్య హౌస్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. తనకు తెలియకుండా శ్రీహాన్ శ్రీసత్య మాయలో పడిపోయాడు. ఆమెకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు, గేమ్ ఆడుతున్నాడు. గతంతో పోల్చితే అతడి బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. వెటకారం ఎక్కువైపోయింది.

45
Bigg Boss Telugu 6

హౌస్లో శ్రీసత్యకు శ్రీహాన్ ఫేవర్ గా ఉంటున్నారన్నది నిజం. ఆది నిన్న ఎపిసోడ్లో రుజువైంది. కెప్టెన్సీ కంటెండర్ గా శ్రీహాన్ కి అవకాశం వచ్చింది. అయితే తన కెప్టెన్సీలో తప్పులు చేసినందుకు శ్రీహాన్ ని నాగార్జున ఒక వారం కంటెండర్ అయ్యే అవకాశం లేకుండా శిక్ష విధించాడు. దాని ప్రకారం శ్రీహాన్ కెప్టెన్ గా పోటీపడకూడదు. అయితే తన ఛాన్స్ మరొక కంటెస్టెంట్ కి ఇవ్వొచ్చు. దీంతో శ్రీహాన్ తన అవకాశాన్ని శ్రీసత్యకు ఇచ్చాడు. 
 

55
Bigg Boss Telugu 6


ఈ పరిణామాలు గమనిస్తున్న ఆడియన్స్ శ్రీహాన్ మరో అర్జున్ లా తయారయ్యాడు అంటున్నారు. శ్రీసత్య మనసు గెలుచుకునే క్రమంలో శ్రీహాన్ గేమ్ గాడి తప్పుతుంది అంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే శ్రీహాన్ శ్రీసత్య చేతికి చిక్కిన మరో బకరా అవుతాడంటున్నారు. శ్రీసత్యకు బలయ్యే నెక్స్ట్ కంటెస్టెంట్ అతడే అన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories