అప్పుడు రామ జ్ఞానాంబ తో, నీకు చెప్పకుండా జానకి గారిని చదివిపించడం తప్పే నన్ను క్షమించు, దీనికోసం నువ్వు ఏ శిక్ష వేసినా నేను సిద్ధంగా ఉన్నాను అమ్మ అని అంటాడు.జ్ఞానాంబ చాలా కోపంతో తల్లి మాట జవదాటని నువ్వు కూడా మారిపోయావు,నువ్వు పుట్టడం నాకు వారం అనుకున్నాను కానీ పుట్టకుండా ఉండడమే మంచిదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది అని అంటుంది. రామ చాలా బాధపడుతూ ఆ మాటతో "నా ప్రాణం ఇక్కడే పోయింది అమ్మ"అని చెప్పి పక్కన ఉన్న నది వైపు నడుస్తూ ఉంటాడు.