SKanda Twitter Talk : రామ్ పోతినేని ‘స్కంద’ ట్విటర్ రివ్యూ.. మాస్ అవతార్ లో రాపో రచ్చ..

First Published | Sep 28, 2023, 8:18 AM IST

ఉస్తాద్ రామ్ పోతినేని - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలోని ‘స్కంద’ ఈరోజు ప్రేక్షకుల ముందు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్స్, మార్నింగ్ షోలు పడగా.. ప్రేక్షకులు ట్విటర్(X) లో తమ సమీక్షలు వెల్లడిస్తున్నారు. 
 

ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం మాస్ రోల్స్ కే ఓటేస్తున్నారు. ఊరమాస్ లుక్ లో బిగ్ స్క్రీన్ పై కనిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో రామ్ పోతినేని ‘స్కంద’రూపుదిద్దుకుంది. ఈరోజు (సెప్టెంబర్ 28) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. 
 

ఇప్పటికే ‘స్కంద’ మూవీ ప్రీమియర్స్ యూఎస్ఏలో పడింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మార్నింగ్ షోలో ప్రదర్శించారు. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ ‘కల్ట్ జాతర’ అంటూ రచ్చ చేస్తున్నారు. ఇక సినిమా చూసిన ఫ్యాన్స్, ఆడియెన్స్ మూవీ విషయాలను ట్వీటర్ వేదికన పంచుకుంటున్నారు. 


రామ్ పోతినేని మాస్ క్యారెక్టర్లలో పూనకాలు తెప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక బోయపాటి డైరెక్షన్ లోని ‘స్కంద’లో మరింత రగ్డ్ లుక్ తో ఆకట్టుకున్నారు. సినిమాలో రామ్ మాస్ అవతార్ నెవెర్ బిఫోర్ లుక్ అని తెలుపుతున్నారు. అదిరిపోయే లుక్ తోపాటు యాస, భాష, అటిట్యూడ్ అదిరిందని అంటున్నారు. 

ఇక బోయపాటి శ్రీను ‘స్కంద’తో మరోసారి తన ర్యాంపేజ్ చూపించారని తెలుపుతున్నారు. రామ్ ను నెక్ట్స్ లెవల్లో చూపించారని అభిమానులు ఖుషీ అవుతున్నారు. మాస్ ఫ్యాన్స్ కి రామ్ ఫుల్ మీల్స్ అందించారని తెలుస్తోంది. కథ పరంగానూ ప్రేక్షకులను ఆకట్టుుకుందని ట్వీట్ల ద్వారా అర్థమవుతోంది. ఇప్పటికే యూఎస్ఏ ప్రీమియర్స్ బ్లాక్ బాస్టర్ రిపోర్ట్స్ ను అందిస్తున్నాయి. 

మార్నింగ్ షో వీక్షించిన ఆడియెన్స్ కూడా పాజిటివ్ టాక్ తోనే స్పందిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ కేక పుట్టిందని, రామ్ ఇంట్రో ఫైట్ కు థియేటర్లు బద్దలయ్యాయని అంటున్నారు. స్క్రీన్ ప్లై, యాక్షన్ సీన్లతో బోయపాటిరాపో కుమ్మేశారని ఖుషీ అవుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ కే బ్లాక్ బాస్టర్ అని తేల్చేస్తున్నారు. 

ఇక చిత్రంలోని ప్రథమ అర్థంలో మూడు యాక్షన్ సీన్లు అబ్బురపరిచేలా ఉన్నాయని అంటున్నారు. లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే బొమ్మ హిట్ అని చెబుతున్నారు. ఇక డైలాగ్స్ కూడా కథకు, పాత్రలకు ప్రాణంపోసేలా ఉన్నాయంట. రామ్ కెరీర్ లోనే బెస్ట్ పెర్పామెన్స్ కూడా ఇచ్చారని రివ్యూలు ఇచ్చేస్తున్నారు. పాజిటివ్ టాక్ సొంతం కావడంతో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

మరోవైపు, థమన్ బీజీఎం కూడా అదిరిపోయిందని అంటున్నారు. బీజీఎం, సాంగ్స్ కు మాస్ కంపోజింగ్ అందించారని తెలుపుతు్నారు. మరికొందరు మాత్రం కొన్ని యాక్షన్ సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతగా ఆకట్టుకోలేదని, రామ్ పోతినేని తన పెర్ఫామెన్స్ తో మాత్రం చితక్కొట్టాడని అంటున్నారు. సాంగ్స్  విషయంలోనూ ప్రేక్షకులు పర్లేదనే తెల్చేస్తున్నారు. థమన్ బీజీఎంపై ఎక్స్ పెక్టేషన్ రీచ్ కాలేదని అర్థం అవుతోంది. 
 

ఇక ‘నీ చుట్టు చుట్టు తిరిగినా’ సాంగ్ కు ప్రేమ్ రక్షిత్ మాస్టర్  నెక్ట్స్ లెవల్ కొరియోగ్రఫీ అందించారని, ఐఫీస్ట్ పక్కా అని తెలుపుతున్నారు. మొత్తానికి సినిమా పాజిటివ్ టాక్స్ ను దక్కించుకుంటోంది. బ్లాక్ బాస్టర్ పక్కా అంటున్నారు. మరికొద్ది సేపట్లో రాబోయే ఫుల్ రివ్యూతో ఫైనల్ రిజల్ట్ అందనుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిత్తూరి నిర్మించారు. యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (SreeLeela)  హీరోయిన్. థమన్ సంగీతం అందించారు. 

Latest Videos

click me!